local body
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం క్లారిటీ రావడం లేదు. రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దోబుచులాట లాడుతున్నాయి. ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నా ప్రతీసారి ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసి వాయిదా వేసింది.
Also Read: తన సమాధిపై ఏం రాయలో బాలు ముందే చెప్పారట!
ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గతంలో వివాదాస్పదమైంది. రాజ్యాంగ పదవీలో ఉన్న ఆయనను ఏపీ సర్కారు తప్పించి ఎన్నికల కమిషనర్ గా కనకరాజ్ ను నియమించింది. దీంతో నిమ్మగడ్డ ప్రసాద్ హైకోర్టు ఆశ్రయించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అనేక కీలక పరిణామాల అనంతరం నిమ్మగడ్డ ప్రసాద్ తిరిగి ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకమయ్యారు.
ఇటీవల ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్, గ్రామపంచాయతీ రెండో విడుదల ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆరువారాలపాటు వాయిదా వేయాలని సూచించారు. దీంతో అర్ధాంతరంగా స్థానిక సంస్థల ఎన్నికలు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే కొన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది.
తాజాగా బీహార్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా కోర్టులు సైతం కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించుకోవాలని తీర్పునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలపై అందరికీ దృష్టిపడింది. అయితే ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ప్రసాద్ పదవీలో ఉండటంతో ఆయన గతంలో ఏకగీవ్రమైన ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్ కు షాకిచ్చేలా పాతవాటికి కూడా మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.
Also Read: వైఎస్ వివేకా హత్య: కీలక సమాచారం చెప్పిన ఆ ఇద్దరు మహిళలు?
స్థానిక ఎన్నికలకు కరోనా అడ్డంకులు తొలగిపోవడంతో త్వరలోనే మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కన్పిస్తున్నారు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇటీవల కరోనాతో మృతిచెందారు. ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలారోజులుగా రాజకీయ నిరుద్యోగులంతా స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో ఎస్ఈసీ సైతం వీటి నిర్వహణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.