https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ షూట్ లో కొత్త మార్పులు !

రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కి సంబందించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. అక్టోబర్ నుండి జరగబోయే షెడ్యుల్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించడానికి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సెట్స్ ను డిజైన్ చేయిస్తున్నాడట. మొదట ఈ సీన్స్ ను గోల్కండ కోటలో షూట్ చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేసుకున్నప్పటికీ.. తారక్ […]

Written By:
  • admin
  • , Updated On : September 26, 2020 / 04:46 PM IST
    Follow us on


    రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కి సంబందించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. అక్టోబర్ నుండి జరగబోయే షెడ్యుల్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించడానికి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సెట్స్ ను డిజైన్ చేయిస్తున్నాడట. మొదట ఈ సీన్స్ ను గోల్కండ కోటలో షూట్ చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేసుకున్నప్పటికీ.. తారక్ పై ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కావడంతో.. సీన్స్ లో పిరంగలిలో పేల్చే షాట్స్ కూడా అంతే స్థాయిలో తీయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడట. అందుకే ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్స్ వేయిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, అసలు సినిమాలో తారక్ గెటప్ ఎలా ఉండనుందని అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

    Also Read: డ్రగ్స్ కేసులో రకుల్ నలుగురు స్టార్ల పేర్లు బయటపెట్టిందా?

    అన్నిటికీ మించి ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రలోనే స్వతహాగా మంచి ఆవేశం ఉంటుంది. ఆ ఆవేశానికి ఎన్టీఆర్ నటనకి కరెక్ట్ మ్యాచ్ కుదిరితే.. అవుట్ ఫుట్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడని.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లుక్స్ కూడాచాలకొత్తగా ఉంటాయని తెలుస్తోంది. అయితే రాజమౌళికి పర్సనల్ గా తారక్ పై అభిమానం ఉంది. అందుకే ఎన్టీఆర్ ను సినిమాలో హైలైట్ చెయ్యటానికే రాజమౌళి మొదటినుండి కాస్త జాగ్రత్త తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే తారక్ కోసం తెలంగాణ యాసలో ప్రత్యేకంగా డైలాగ్స్ రాయించాడు. ఎలాగూ తెలంగాణ యాసలో తారక్ పలికే మాడ్యులేషన్ చాలా గొప్పగా ఉంటుంది.

    Also Read: తన సమాధిపై ఏం రాయలో బాలు ముందే చెప్పారట!

    ఇప్పటికే చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలో అది రుజువు అయింది. పైగా ఎన్టీఆర్ డైలాగ్ లన్నీ అద్భుతంగా ఉంటాయని.. మొత్తం సినిమాలోనే ప్రధాన హైలెట్స్ లో తారక్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయనే టాక్ కూడా ఉంది. ఆ మధ్య రచయిత సాయి మాధవ్ బుర్ర కూడా ఓ ఇంటర్వ్యూలో తారక్ డైలాగ్ లు అన్నీ అద్భుతంగా వచ్చాయని చెప్పుకొచ్చాడు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సాంగ్స్ తో పాటు చాలా వరకూ నేపథ్య సంగీతాన్ని కూడా కీరవాణి పూర్తి చేసినట్లు తెలుస్తోంది.