Thief: గుడిలో దొంగతనం.. క్షమించాలని గుడి వస్తువులు తిరిగిచ్చిన దొంగ

Thief: ఎక్కడ దొంగతనం చేసినా దొంగలకు బాధ, దు:ఖం, పశ్చాత్తాపం ఉండదు.కానీ దేవుడి గుడిలో దొంగతనం చేస్తే మాత్రం ఆ దు:ఖం ఉంటుంది. అదే ఆ దొంగలో పశ్చాత్తాపానికి కారణమైంది. దీంతో క్షమించాలంటూ గుడికి దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. అదే విచిత్రం మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్లోని […]

Written By: NARESH, Updated On : October 30, 2022 5:07 pm
Follow us on

Thief: ఎక్కడ దొంగతనం చేసినా దొంగలకు బాధ, దు:ఖం, పశ్చాత్తాపం ఉండదు.కానీ దేవుడి గుడిలో దొంగతనం చేస్తే మాత్రం ఆ దు:ఖం ఉంటుంది. అదే ఆ దొంగలో పశ్చాత్తాపానికి కారణమైంది. దీంతో క్షమించాలంటూ గుడికి దొంగిలించిన వస్తువులను తిరిగి ఇచ్చేశాడు. అదే విచిత్రం మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ బాలాఘాట్ జైన మందిరంలో చోరీకి పాల్పడ్డ ఓ దొంగ అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. దొంగతనం చేసిన వస్తువులను తిరిగిచ్చేయడమే కాకుండా.. క్షమాపణలు చెబుతూ లేఖ రాశాడు. బాలాఘాట్లోని శాంతి నాథ్ దిగంబర జైన దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. 9 వెండి గొడుగులు, ఒక వెండి జాడీ, 3 ఇత్తడి పాత్రలు అపహరించారు. మనసు మార్చుకొని చోరీ చేసిన వస్తువులను గ్రామ పంచాయతీ వద్ద పెట్టి వెళ్లాడు.

అక్టోబరు 24న లమ్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినాథ్ దిగంబర్ జైన్ టెంపుల్ నుండి గుర్తు తెలియని దొంగ 10 అలంకారమైన వెండి ఆభరణాలను దొంగిలించాడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ దాబర్ తెలిపారు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు.

శుక్రవారం ఒక జైన కుటుంబ సభ్యులు లామ్టాలోని పంచాయితీ కార్యాలయం సమీపంలోని గొయ్యిలో పడి ఉన్న బ్యాగ్‌ను గుర్తించి వారు పోలీసులను, సంఘ సభ్యులను అప్రమత్తం చేసినట్లు అధికారి తెలిపారు.

చోరీకి గురైన వస్తువులను బ్యాగ్‌లో పెట్టి అక్కడ పెట్టిన దొంగ క్షమాపణ లేఖ రాశాడు. ఈ లేఖ, ఆభరణాలతో సహా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

లేఖ, ఫోటో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యింది.“గుడిలో దొంగతనం చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను తప్పు చేసాను, నన్ను క్షమించు. దొంగతనం తర్వాత నేను చాలా బాధపడ్డాను. దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

Tags