Chandrababu: అసలే తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది. చంద్రబాబు మొన్ననే జైలుకు వెళ్లి బయటికి వచ్చారు. తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంది. లేకుంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాక తప్పదు. అయితే ఓ విషయంలో తాజాగా తెలుగుదేశం పార్టీ నవ్వులపాలు అయింది. చులకనగా మారింది. కెసిఆర్ అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు అన్న ప్రచారం సాగుతోంది.
తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఆరు రకాల హామీలపై సాగిన ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహాశక్తి, యువ గళం, అన్నదాత, ఇంటింటికి నీరు, పూర్ టు రీచ్, బీసీ రక్షణ చట్టం.. అంటూ సూపర్ సిక్స్ పథకాలను టిడిపి ప్రకటించింది.వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
అయితే ఈ ఆరు అంశాలకు సంబంధించి.. వీడియోలో చూపించిన వ్యక్తులు.. తెలంగాణలో బి ఆర్ ఎస్ శ్రేణులు చూపించిన వీడియోలోనే కనిపించారు. దీంతో ఇది వివాదంగా మారింది. తెలంగాణలో అభివృద్ధిని చూపిస్తూ.. బిఆర్ఎస్ సోషల్ మీడియా ఈ వీడియోను రూపొందించింది. అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ ఇదే వీడియోను సూపర్ సిక్స్ ప్రాజెక్టు కోసం వినియోగించడం విశేషం. కెసిఆర్ అభివృద్ధిని చంద్రబాబు రీమిక్స్ చేశారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. రకరకాల మిమ్స్ తో దర్శనమిస్తున్నాయి. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
కేసిఆర్ కథకి బాబు రీమిక్స్..!!#EndOfTDP #Kcr #VennupotuBabu pic.twitter.com/0HMbFS4nUm
— andhra memers (@andhra_memers) November 9, 2023