Mahesh Babu: కుటుంబ నేపథ్యంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా గ్లోబల్ స్టార్ గా ఎదగడానికి టాలెంట్ నే ఉపయోగించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎంతో కష్టపడి సక్సెస్ సాధించారు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనలేని అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే అలర్ట్ అయ్యే అభిమానులు కూడా కోకొల్లాలు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యారు తారక్. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.
ఇక బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా సంపాదించిన తారక్ గురించి మహేష్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ గొప్ప నటుడని.. ఆయన నటించిన సినిమాలలో తనకు బాగా నచ్చే సినిమా ఆది అని తెలిపారు. ఆ సినిమాపై ఉన్న ఇష్టంతో చాలా సార్లు చూశారట మహేష్ బాబు. అంతే కాదు ఇందులో ఎన్టీఆర్ ను తప్ప మరో హీరోను కూడా ఊహించుకోలేదని.. ఊహించుకున్నా కూడా వేరే హీరోలు సెట్ అవరు అంటూ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా గురించి కొనియాడారు మహేష్ బాబు.
వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పుడు పెద్ద సంచలనం. ఎన్టీఆర్ కు అతి చిన్న వయసులోనే స్టార్ హోదాను తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఏ హీరోకు అయినా కెరీర్ లో ఫ్లాప్ లు ఉండడం సహజం. అలాగే ఎన్టీఆర్ కూడా ఎదుర్కొన్నారు. కానీ వెంట వెంటనే తన సత్తా చూపిస్తూ మళ్లీ హిట్ లను తన ఖాతాలో వేసుకునేవారు. చివరగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటారు ఎన్టీఆర్. మొత్తం మీద ఒక స్టార్ నటుడు ఈ ఎన్టీఆర్ ను కొనియాడడం గ్రేట్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.