Awas Yojana Scheme :  ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు.. రాష్ట్రాలు ఆ వాటా ఇవ్వాల్సిందే: కేంద్రం ఆదేశాలు

కేంద్రం ప్రభుత్వ పథకం అయిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ పేదవాడికి ఇల్లు నిర్మించేందుకు అవసరమైన సాయం చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా రూ. 2.50 లక్షలకు కేంద్రం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.1.50 లక్షలు చెల్లించాలని పేర్కొంది

Written By: Srinivas, Updated On : July 29, 2024 4:10 pm
Follow us on

Awas Yojana Scheme :  కేంద్రంలో బీజేపీ 3.0 అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పేదల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పేదలకు కావాల్సిన సౌకర్యాలను అందించేందుకు ముందుకువస్తోంది. పేదలకు ముఖ్య అవసరాల్లో ఒకటైన ఇంటి నిర్మాణానికి భారీ ఎత్తున సాయం చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియలో రాష్ట్రాలు కూడా సాయం చేయాలని కోరింది. కేవలం కేంద్ర ప్రభుత్వం మీదనే కాకుండా రాష్ట్రాలు ఈ పథకంలో భాగమై విజయవంతం చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఉంటుందని పరోక్షంగా తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో పేదలకు రూ.4 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వాలు కొన్ని ఈ పథకంలో సాయం చేయడానికి ముందుకు రాలేదని, రాష్ట్ర వాటా కలుపుకోవడానికి ఒప్పుకోలేదని కేంద్రం తెలిపింది. కానీ ప్రస్తుతం రాష్ట్రాల వాటా కచ్చితంగా ఉండాల్సిందేనని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కొత్త లబ్ధిదారులకు వర్తింపజేసేలా ఉంటుందని పేర్కొంది. ఈ పథకంపై కేంద్రం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేసిందంటే?

కేంద్రం ప్రభుత్వ పథకం అయిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సోమవారం ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. ప్రతీ పేదవాడికి ఇల్లు నిర్మించేందుకు అవసరమైన సాయం చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా రూ. 2.50 లక్షలకు కేంద్రం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.1.50 లక్షలు చెల్లించాలని పేర్కొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. దేశంలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రానున్న 100రోజుల్లో1.28 వేల ఇళ్లు పూర్తి చేయాలని కార్యాచరణ సిద్ధం చేవారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. కానీ ఇందులో 6.50 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని అన్నారు. మిగతావి అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. అయితే ముందుగా కొత్త ఇళ్ల నిర్మాణాలు 1.28వేల ప్రారంభించి.. ఆ తరువాత మిగతా వాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే కొత్త వారిని ఎలా ఎంపిక చేస్తానేదానిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై హర్షాతిరేకాల వ్యక్తమవుతున్నాయి.

ఇక కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకం ను అమలు చేయడం లేదని, ఇప్పటి వరకు కొత్తగా ఇల్లు నిర్మించుకునే పేదలకు రూ.2.50 సాయం అందుతోందని, ఇప్పుడు రాష్ట్రాల వాటా రూ.1.50 లక్షలు కచ్చితంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే కాకుండా టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపడితే మరింత సాయం చేసే అవకాశం ఉంది. ఇది కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తరువాత అమలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా పట్టణాల్లో ఉండే పేదలకు ఈ పథకం వర్తిస్తుంది. ఏపీలో 23 ప్రాంాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ఇక్కడున్న పేదలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.4 లక్షలు అందించనున్నారు. ఉపాధి హామీ కింద మరో రూ.30 వేలు అందిస్తారు.