Ireland vs Zimbabwe : గల్లీలో గోలీలు ఆడుకునే వాన్ని క్రికెటర్ ను చేస్తే ఇలాగే ఉంటుంది.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత దరిద్రమైన ఫీల్డింగ్ ఇది..

ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 18 ఓవర్లో జింబాబ్వే బౌలర్ రీఛార్జ్ వేసిన బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మెక్ బ్రైన్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ కొట్టాడు. ఆ బంతిని జింబాబ్వే ఫీల్డ్ చటార ఆపాలని ప్రయత్నించాడు.. బౌండరీ కార్డుకు కొద్ది దూరంలో బంతిని ఆపాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ లైన్ అవతలికి వెళ్లిపోయాడు

Written By: Anabothula Bhaskar, Updated On : July 29, 2024 4:21 pm
Follow us on

Ireland vs Zimbabwe ; భారత్ తో t20 సిరీస్ కోల్పోయిన జింబాబ్వే.. పసికూన ఐర్లాండ్ చేతిలోనూ ఓటమిపాలైంది. ఏకైక టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. జింబాబ్వే విధించిన టార్గెట్ చేజ్ చేయడంలో 21 పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయినప్పటికీ.. ఆత్మవిశ్వాసంతో ఐర్లాండ్ పోరాడింది. చివరికి గెలిచింది. ఏకైక టెస్ట్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 210 పరుగులు చేసింది. మస్ వరె 74 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఆటగాడు గుంబి 49 రన్స్ చేసి సెకండ్ లీడ్ స్కోరర్ గా ఉన్నాడు. ఐలాండ్ బార్డర్లలో బ్యారీ, అండీ చెరో మూడు వికెట్లు దక్కించుకొని, సత్తా చాటారు.

అనంతరం ఐర్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించింది. 250 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఓపెనర్ మూర్ 79 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో జింబాబ్వే బౌలర్లు ఏకంగా 59 ఎక్స్ ట్రాలు వేశారు. వారు వేసిన ఆ ఎక్స్ ట్రా లు రెండవ అత్యధిక స్కోర్ గా నిలబడ విశేషం. జింబాబ్వే వికెట్ కీపర్ క్లైవ్ మదండే 42 పరుగులు బైస్ రూపంలో ఇచ్చాడంటే.. ఎంత చెత్త కీపింగ్ చేసాడో అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలర్లలో ముజరబాని, చివంగా చలో మూడు వికెట్లు సాధించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో 40 పరుగుల లోటు తో రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జింబాబ్వే 197 రన్స్ చేసింది. డియాన్ మైయర్స్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో పని ఉందన్నట్టుగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. ఐర్లాండ్ బౌలర్లలో మెక్ బ్రైన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఐర్లాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయింది. ఐర్లాండ్ బ్యాటర్లలో టకర్ 56, మెక్ బ్రైన్ 55* అర్థ సెంచరీలతో కదం తొక్కారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ 4 వికెట్లు సాధించాడు.

ఐర్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 18 ఓవర్లో జింబాబ్వే బౌలర్ రీఛార్జ్ వేసిన బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మెక్ బ్రైన్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా షాట్ కొట్టాడు. ఆ బంతిని జింబాబ్వే ఫీల్డ్ చటార ఆపాలని ప్రయత్నించాడు.. బౌండరీ కార్డుకు కొద్ది దూరంలో బంతిని ఆపాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ లైన్ అవతలికి వెళ్లిపోయాడు. అతడు తేరుకొని తిరిగి వచ్చి బంతిని విసిరేసరికి ఐర్లాండ్ బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. అతడు బౌండరీ వదిలిన ఐర్లాండ్ జట్టుకు నాలుగు పరుగులు వచ్చేవి. కానీ చటార నిర్లక్ష్యం వల్ల ఐదు పరుగులు వచ్చాయి. ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త ఫీల్డింగ్ అని, గల్లీలో గోలీలు ఆడుకునేవాన్ని క్రికెటర్ ను చేస్తే ఇలానే ఉంటుందని.. నెటిజన్లు విమర్శిస్తున్నారు. “అతడిని టెస్ట్ మ్యాచ్ లోకి ఎందుకు ఎంపిక చేశారు? బంతిని ఆపేందుకు అతడు పడిన ప్రయాస చూస్తే నవ్వొస్తోంది.. జింబాబ్వే అనామక జట్టు అని తెలుసు. కానీ ఇంత దారుణమైన ఆటగాళ్లను ఎంపిక చేస్తుందని అసలు అనుకోలేదు.. ఎందుకైనా మంచిది వచ్చే మ్యాచ్ లలో అతడిని జట్టులోకి తీసుకోవద్దని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.