Homeజాతీయ వార్తలుFood Adulteration: ఆహార కల్తీ.. దక్షిణ భారతంలో మనమే టాప్‌

Food Adulteration: ఆహార కల్తీ.. దక్షిణ భారతంలో మనమే టాప్‌

Food Adulteration: దేశవ్యాప్తంగా ఆహార కల్తీ సమస్య ఆందోళనకరంగా మారుతోంది. నాలుగేళ్లలో ఆహార భద్రత(Food sefty) అధికారులు సేకరించిన నమూనాల్లో సగటున 22 శాతం కల్తీగా తేలడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన నివేదిక(Report to Parlment) ప్రకారం, 2021–24 మధ్య సేకరించిన ఆహార పదార్థాల నమూనాల ఆధారంగా రాష్ట్రాల వారీగా కల్తీ శాతాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచాయి.

తెలంగాణలో కల్తీ ఆహారం..
తెలంగాణ(Telangana)లో ఆహార కల్తీ విషయంలో పరిస్థితి ఆశ్చర్యకరంగా ఉంది. రాష్ట్రంలో పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా నిర్ధారణ అవుతోంది. అంటే, 14 శాతం నమూనాలు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని స్పష్టమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో(South States) ఈ శాతం రెండో అత్యధికంగా నమోదైంది. ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన పెరగాల్సిన అవసరం ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

తమిళనాడు అగ్రస్థానం
దక్షిణ భారత రాష్ట్రాల్లో తమిళనాడు(Tamilnadu) 20 శాతం కల్తీ ఆహార నమూనాలతో మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో పరీక్షించిన ప్రతి ఐదు నమూనాల్లో ఒకటి కల్తీగా తేలుతోంది. తమిళనాడు తర్వాత తెలంగాణ, కేరళ (13.11 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (9 శాతం), కర్ణాటక (6.30 శాతం) వరుసగా స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ఆహార నాణ్యతపై ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

భద్రతపై చర్యలు అవసరం..
దేశవ్యాప్తంగా 22 శాతం కల్తీ నమూనాలు తేలడం ఆహార భద్రతా వ్యవస్థలో సవాళ్లను సూచిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కల్తీ సమస్యను అరికట్టేందుకు కఠిన చర్యలు, ప్రజల్లో చైతన్యం కల్పించడం చాలా ముఖ్యం. ఆహార నాణ్యతను కాపాడటం ద్వారా ప్రజారోగ్యాన్ని సంరక్షించే దిశగా అధికారులు అడుగులు వేయాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular