Flixbus India: పర్యావరణ అనుకూల, కాలుష్య రహిత ఫ్లిక్స్‌ బస్సులు.. కొత్తగా ఆరు రూట్లలో విస్తరణ.. అసలు వీటి ప్రత్యేకత ఏంటంటే?

స్థానిక బస్సు ఆపరేటర్‌లతో సహకరిస్తూ, ఫ్లిక్స్‌ బస్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్, రాబడి నిర్వహణ, దిగుబడి ఆప్టిమైజేషన్‌లో సహాయపడే దాని యాజమాన్య సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది.

Written By: Raj Shekar, Updated On : September 4, 2024 12:46 pm

Flixbus India

Follow us on

Flixbus India: పకపమైన, పర్యావరణ అనుకూల ప్రయాణానికి గ్లోబల్‌ ట్రావెల్స్‌–టెక్‌ లీడర్‌ అయిన ఫ్లెక్స్‌ బస్సులు దేశంలో విస్తరిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఉత్తర భారత దేశానికి పరిమితమైన బస్సులు ఇప్పుడు దక్షిణ భారత దేశానికీ విస్తరించాయి. ఆరు కొత్త మార్గాలకు తమ కార్యకలాపాలను విస్తరించినట్లు ఫ్లిక్స్‌బస్‌ ఇండియా తెలిపింది. సెప్టెంబర్‌ 10 నుంచి కొత్త సేవలు ప్రారంభమవుతాయని గ్లోబల్‌ ఫ్లిక్స్‌ సీఈవో మాక్స్‌ జ్యూమర్‌ తెలిపారు.

పర్యావరణ అనుకూల, కాలుష్య రహిత బస్సులను భారత్‌లో నడుపుతోంది ఫ్లిక్స్‌ బస్‌ ఇండియా సంస్థ. మెట్రో నగరాల్లో వీటిని తిప్పుతోంది. ఇప్పటి వరకు ఉత్తర భారత దేశంలోని ఢిల్లీ, ముంబై, తదితర నగరాల్లో నడుపుతున్న ఈ బస్సులను దక్షిణ భారత దేశానికీ విస్తరించాలని ఫ్లిక్స్‌ బస్‌ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 10 నుంచి దక్షిణ భారతదేశంలోనూ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయంచింది. మొదట బెంగళూరు నుంచి చెన్నై, హైదరాబాద్‌లో సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 33 నగరాలను కలిసేలా అక్టోబర్‌ 6 వరకు సర్వీస్‌ సేవలు పెంచుతారు. అక్టోబర్‌ 6 వరకు ప్రయాణం కోసం సెప్టెంబర్‌ 3 నుండి 15 వరకు బుకింగ్‌లకు ప్రత్యేక ధర ప్రమోషన్‌ అందుబాటులో ఉంది. కంపెనీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలో మరింత విస్తరించాలని యోచిస్తోంది.

జర్మనీ సంస్థ..
ఫ్లిక్స్‌ బస్సు జర్మనీకి చెందిన బస్సు, రైలు సేవల బ్రాండ్‌ సేవలను అందిస్తుంది. సెప్టెంబర్‌ 3న బెంగళూరులో సర్వీస్‌ను కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్‌ ప్రారంభించారు. బెంగళూరు నుంచి చెనై్న, హైదరాబాద్‌కు సర్వీస్‌లు ప్రారంభించారు. రాబోయే కొన్ని సంవత్సరాలలో (భారతదేశంలో) 80 నుంచి∙100 మిలియన్‌ యూరోల (రూ. 741 నుండి 927 కోట్లు) పెట్టుబడి పెట్టాలనేది ఫ్లిక్స్‌ బస్‌ సంస్థ లక్ష్యం. ఇది బలమైన భారత్, జర్మనీ బంధాన్ని మరింత బలపరుస్తుందని ఇరు దేశాలూ భావిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా 101 నగరాలకు..
ఫ్లిక్స్‌ బస్‌ దేశ æవ్యాప్తంగా 101 నగరాలను, 215 స్టాప్‌లను కలుపుతుంది. బెంగళూరు ప్రారంభించడంలో భాగంగా, సెప్టెంబర్‌ 3 నుండి 15 వరకు బుకింగ్‌ వ్యవధిలో సెప్టెంబర్‌ 10 నుండి అక్టోబర్‌ 6 వరకు బయలుదేరే వ్యవధిలో కొత్త రూట్‌లకు కేవలం రూ. 99 ప్రత్యేక ధర ప్రమోషన్‌ను ప్రకటించింది. తరువాత దశలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు కేరళ అంతటా అదనపు మార్గాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ కేంద్రంగా ఫ్లిక్స్‌ బస్‌ దేశంలోకి వచ్చింది. విజయానంద్‌ ట్రావెల్స్‌ వంటి ఆరు బస్‌ ఆపరేటర్లతో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉత్తర భారత కార్యకలాపాలు విజయవంతం అయిన తర్వాత, ఇంటర్‌సిటీ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చే మా ప్రయాణంలో దక్షిణ భారతదేశానికి విస్తరించడం తదుపరి దశ.

6 వేల బస్సులు..
స్థానిక బస్సు ఆపరేటర్‌లతో సహకరిస్తూ, ఫ్లిక్స్‌ బస్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్, రాబడి నిర్వహణ, దిగుబడి ఆప్టిమైజేషన్‌లో సహాయపడే దాని యాజమాన్య సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌ను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థ సుమారు 6 వేల బస్సులను నడుపుతోంది. ఈ కంపెనీ 2013లో జోచెన్‌ ఎంగెర్ట్, ఆండ్రే ష్వామ్లీన్, డేనియల్‌ క్రాస్‌ స్థాపించారు, ఇప్పుడు 40 దేశాలకు విస్తరించింది. 2023లో 2 బిలియన్‌ యూరోల వార్షిక ఆదాయాన్ని అందుకుంది, ఏడాది క్రితం కంటే 30% పెరిగింది. దీని పెట్టుబడిదారుల సెట్‌లో మార్క్యూ సంస్థలు జనరల్‌ అట్లాంటిక్, పెర్మిరా మరియు బ్లాక్‌రాక్‌ వంటివి ఉన్నాయి.