Rishi Kapoor Birth Anniversary: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో ‘రిషి కపూర్’ ఒకరు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ సెప్టెంబర్ 4వ తేదీన ఆయన జయంతి సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు… ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నీ క్లాసికల్ గా మిగడమే కాకుండా ప్రేక్షకులందరి చేత గొప్ప నటుడిగా కీర్తి ప్రతిష్టలను అందుకున్నాడు. 1952 సెప్టెంబర్ 4వ తేదీన జన్మించిన రిషి కపూర్ చాలా గొప్ప సినిమాలను చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే లేడీస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో కూడా ఈయన తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా సంపాదించుకున్న హీరోల్లో ఈయన కూడా ఒకరు…ఇతను బర్త్ డే సందర్భంగా ఆయన చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాల గురించి మనం తెలుసుకుందాం…
బాబీ (1973)
రాజ్ కపూర్ దర్శకత్వం లో వచ్చిన బాబీ సినిమా తో రిషి కపూర్ ఇండస్ట్రీకి అరంగేట్రం చేశాడు. ఆయన చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని హీరోగా మంచి పేరును సంపాదించుకున్నాడు. అలాగే ఈ సినిమా క్లాసికల్ హిట్ గా నిలవడం లో ఆయన పోషించిన రాజ్ క్యారక్టర్ కూడా చాలా కీలకమైన పాత్ర వహించిందనే చెప్పాలి…
2. చాందిని
ఇక చాందిని సినిమాతో చాలా మంచి క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా అప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరికీ పోటీని ఇచ్చే విధంగా తన నటన ప్రతిభను చూపిస్తూ విమర్శకుల చేత కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఇక యూత్ ని బాగా అట్రాక్ట్ చేయడంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాతోనే ఆయన ప్రభంజనం అనేది మొదలైందనే చెప్పాలి. యశ్ చోప్రా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక క్లాసికల్ హిట్ సినిమాగా మిగిలడమే కాకుండా అటు దర్శకుడికి, ఇటు హీరోకి కూడా చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది…
3.కర్జ్
సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పునర్జన్మ కథాంశంతో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక అప్పటివరకు ఇలాంటి కథంశాలతో బాలీవుడ్ లో పెద్దగా సినిమాలైతే రాలేదు. కాబట్టి అప్పటి ప్రేక్షకులకు ఇది ఒక కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా దర్శకుడి మేకింగ్ కూడా సినిమాని విజయతీరాలకు చేర్చడంలో చాలా వరకు హెల్ప్ అయింది. రిషి కపూర్ నటన మరోసారి ఎలివేట్ అవ్వడమే కాకుండా ఈ సినిమా ద్వారా ఆయన విమర్శకుల చేత ప్రశంసలను కూడా అందుకున్నాడు…ఇక ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో నటిస్తూ తన నటన పరిణితిని కూడా చూపించాడు…