Gujarath CM: గుజరాత్ సీఎం రేసులో ఆ ఐదుగురు?

Gujarath CM: దేశంలోనే అత్యంత శక్తివంతులైన ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. అటువంటి కీలక రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఇక ఆ పార్టీకి పుట్టగతులు ఉంటాయా? మోడీషాల ఇజ్జత్ కే సవాల్ అదీ.. సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించని వారిని పక్క రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తారా? అందుకే గత మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు విజయ్ రూపానీ వరకు అప్రతిహతంగా సాగుతున్న బీజేపీ పాలనను గుజరాత్ లో కొనసాగించడానికి బీజేపీ […]

Written By: NARESH, Updated On : September 11, 2021 8:40 pm
Follow us on

Gujarath CM: దేశంలోనే అత్యంత శక్తివంతులైన ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్. అటువంటి కీలక రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే ఇక ఆ పార్టీకి పుట్టగతులు ఉంటాయా? మోడీషాల ఇజ్జత్ కే సవాల్ అదీ.. సొంత రాష్ట్రంలోనే బీజేపీని గెలిపించని వారిని పక్క రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తారా? అందుకే గత మోడీ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు విజయ్ రూపానీ వరకు అప్రతిహతంగా సాగుతున్న బీజేపీ పాలనను గుజరాత్ లో కొనసాగించడానికి బీజేపీ అధిష్టానం మాస్టర్ ప్లాన్ వేసింది. ఉన్న ఫళంగా గుజరాత్ సీఎం విజయ్ రూపానీతో రాజీనామా చేయించింది.

మోడీషాలు తమ సొంత రాష్ట్రంలో వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆరుదఫాలుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. పైగా మోడీషాల సొంత రాష్ట్రం. బీజేపీపై వ్యతిరేకత సహజం. అందుకే వచ్చే ఏడాది డిసెంబర్ లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే బీజేపీ అడుగులు వేస్తోంది. మొత్తం 182 మంది సభ్యులు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో తిరిగి అధికారం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుత గుజరాత్ సీఎం విజయ్ రూపాని తన పదవికి రాజీనామా సమర్పించారు. దీనికి అసూలు కారనం కొత్త సీఎం ఆధ్వర్యంలో ఎన్నికలకు సమాయత్తం కావటమేనని స్పష్టం అవుతోంది. విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో ఇప్పుడు కొత్త సీఎం ఎవరనేది ఆసక్తికర చర్చకు దారితీసింది.

గుజరాత్ కొత్త సీఎం రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందరికంటే ముందు వరుసలో బలమైన పటేల్ సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పేరు వినిపిస్తోంది. అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, రాష్ట్రమంత్రి ఆర్సీ పాల్డుతోపాటు రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఉన్నారు.

గుజరాత్ లో పటేల్ సామాజికవర్గం అత్యం త ప్రభావవంతమైంది. క్రీయాశీలకమైంది. ఈ క్రమంలోనే పటేల్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి అతడి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని.. లేదంటే వారి నుంచి వ్యతిరేకత ఓటమి ఎదురవుతుందన్న భయం బీజేపీ హైకమాండ్ ను వెంటాడుతోంది.

ఇప్పటికే గుజరాత్ లో కాంగ్రెస్ కు అధికారం కోల్పోకూడదని.. ఇన్నేళ్ల పాలనలోని వ్యతిరేకతను అధిగమించడానికే కొత్త వారికి పదవులుఇవ్వాలని.. పటేల్ సామాజికవర్గాన్ని తృప్తి పరచాలని మోడీషాలు ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. పక్కా లెక్కలు వేసే ఎవరికి సీఎం పీఠం కట్టబెట్టాలనే నిర్ణయానికి బీజేపీ హైకమాండ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కొత్త సీఎం ఎవరనేది బీజేపీ ప్రకటనుంది.