5లక్షలమంది వలస కూలీలను తరలించారట!

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌ డౌన్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకొనిపోయిన దాదాపు 5 లక్షల మంది వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా తమ రాష్ట్రాలకు చేర్చినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు హోం మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ, వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్ల ద్వారా 5 లక్షలకు పైగా […]

Written By: Neelambaram, Updated On : May 11, 2020 6:36 pm
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌ డౌన్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చిక్కుకొనిపోయిన దాదాపు 5 లక్షల మంది వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా తమ రాష్ట్రాలకు చేర్చినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రోజు హోం మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ, వలస కార్మికుల కోసం నడుపుతున్న ప్రత్యేక రైళ్ల ద్వారా 5 లక్షలకు పైగా ప్రజలను తమ రాష్ట్రాలకు రవాణా చేశామని తెలిపింది. అయితే ఇప్పటివరకు మొత్తం 468 ప్రత్యేక రైళ్లు నడిచాయని, వీటిలో 101 రైళ్లు మే 10 న నడిపారు. అంతేకాదు వలస కార్మికులు రైల్వే ట్రాక్‌ లపై ఎట్టి పరిస్థితుల్లో నడవకుండా చర్యలు తీసుకోవాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించింది.

మరోవైపు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖలు రాసి కీలక సూచనలు చేశారు. వలస కూలీలను బస్సులు, శ్రామిక్‌ రైళ్లలో స్వస్థలాలకు పంపించాలని ఆయన చెప్పారు. అలాగే, వలస కూలీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన శిబిరాలను కూడా కొనసాగించాలని ఆయన సూచించారు.వలస కూలీలు స్వస్థలాలకు చేరే వరకు వారికి నీళ్లు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలని అజయ్ భల్లా చెప్పారు. వలస కూలీలకు శ్రామిక్ రైళ్ల వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యం, పారిశుద్ధ్యం, ప్రైవేటు క్లినిక్‌ లను తెరిచే అంశంపై కూడా అజయ్ భల్లా మరో లేఖ రాసి సూచనలు చేశారు.