Employee Separation Process: ఉద్యోగుల విభజన ప్రక్రియ ఆందోళన నింపుతోంది. వారిలో భయాందోళనలు కలిగిస్తోంది. ఏ ప్రాతిపదికన ఉద్యోగులను విభజిస్తారో? ఎలా కేటాయిస్తారో అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమను ఏ జిల్లాకు కేటాయిస్తారోననే బెంగ పట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని 5 వేల మంది ప్రధానోపాధ్యాయులు మినహా దాదాపు లక్ష మంది టీచర్ల భవితవ్యం అగమ్యగోచరంలో పడనుంది. ప్రభుత్వ నిర్వాకంతో తమకు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. స్థానికత ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని చేస్తున్న డిమాండ్ పై ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో అనే అనుమానాలు వస్తున్నాయి.
ప్రభుత్వం ఏ జిల్లాకు కేటాయిస్తుందోనని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. అర్థంతరంగా ఇలా చేస్తే పిల్లల చదువులెలా? అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఏ ప్రాతిపదికపై నియమిస్తారనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంవత్సరం మధ్యలో ఈ నిర్ణయాలు అమలు సాధ్యమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై సిందిగ్ద పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: Cold Wave: గిలిగింతలు పెడుతున్న చలి.. రెడ్డిపల్లిలో 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
రాష్ర్టంలోని 33 జిల్లాలను ఏడు జోన్లుగా రెండు మల్టీ జోన్లుగా విభజించారు. ఉద్యోగుల విభజన తరువాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం గమనార్హం. విభజన అంశంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సీనియార్టీ ప్రాతిపదికన తీసుకున్నా కొందరు ఉపాధ్యాయులు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లే అవకాశమున్నందున ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందోనని ఆతృత నెలకొంది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులు, సంఘాల నేతల్లో స్పష్టత మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది.
Also Read: YS Sharmila: షర్మిల రైతు ఆవేదన యాత్ర.. పులివెందుల టూర్ పైన చర్చ!