MLC Kavitha- Liquor Scam Case: అక్క కళ్లల్లో ఆనందం కోసం.. బావ మోముల్లో సంతోషం కోసం రకరకా అఘాయిత్యాలకు పాల్పడిన. వారినే మనం చూశాం. అది ఎప్పటి నుంచో జరుగుతోంది… కొత్తగా చేయాలి అనుకున్నారేమో.. పైగా మనుషులను హతమారిస్తే రకరకాల కేసులు ఎదుర్కొవాల్సి వస్తుంది. పైగా సమాజం కూడా తెలివిమీరింది కాబట్టి.. ఆ పని చేయకుండా ఓ భారీ మోసానికి తెరలేపాడు ఇతగాడు. ఊరూపేరు తెలియకుండానే ఓ ఆస్తి కొనుగోలు నిమిత్తం కవితకు ఏకంగా రూ. కోట్లు పంపాడు. ఇప్పుడుఉ ఈ విషయాన్ని ఈడీ ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇంతకీ ఆ వ్యక్తి మరో ఎవరో కాదు.. అరుణ్ రామచంద్రన్ పిళ్లై. ఈ కుంభకోణంలో ఇతడి పాత్ర కీలమని చాలా రోజుల క్రితమే కేంద్ర దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి.
కవిత బినామీ
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో మరో షాకింగ్ నిజం వెలుగు చూసింది. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన లాభాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం ఆస్తులు కొనుగోలుకు క్రియేటివ్ డెవలపర్స్ సంస్థకు అరుణ్ పిళ్లై రూ.5 కోట్లు బదిలీ చేశారు. ఇందుకు తమ వద్ద సరిపడా ఆధారాలున్నాయని రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ‘‘నిధులు బదిలీ జరిగిన తీరు, ఆస్తుల క్రయవిక్రయాలు, క్రియేటివ్ డెవలపర్స్ వాంగ్మూలాలు అన్ని కూడా కవిత ఆదేశాలనుసారమే జరిగినట్లు ప్రాథమికంగా అర్థమవుతోంది’’ అని పేర్కొంది. కొనుగోలు చేసిన ఆస్తిని కనీసం పిళ్లై చూడలేదని, విక్రయదారుడిని కలవలేదని కోర్టు గుర్తించింది. పిళ్లై తన పేరిట ఆస్తులు కొనుగోలు చేయలేదని చార్జిషీటులో ప్రాథమికంగా ఈడీ పేర్కొనడాన్ని బట్టి చూస్తే కవిత కోసం బినామీ లావాదేవీకి పాల్పడినట్లు స్పష్టమవుతోందని తెలిపింది. కవిత బినామీగా చెబుతున్న అరుణ్ పిళ్లైని ఈడీ మార్చిలో అరెస్టు చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను విచారించిన సీబీఐ ప్రత్యే క కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ బెయిల్‌ను నిరాకరిస్తూ తీర్పు ఇచ్చారు. తీర్పులో కీలక విషయాలను ప్రస్తావించారు.
24 కోట్ల పెట్టుడి
ఇండోస్పిరిట్స్ సంస్థలో పిళ్లై కేవలం రూ.3.4 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ మొత్తంలో కవిత ఆదేశాలనుసారం రూ. కోటి వి. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చారు. ఇండోస్పిరిట్స్‌కు వచ్చిన రూ.192 కోట్ల మేర లాభాల్లో రూ.32.86 కోట్లు పిళ్లైకి అందాయి. అందులో పిళ్లై ఖాతాలోకి నేరుగా రూ.25.5 కోట్లు బదిలీ అయ్యాయి. రూ.1.7 కోట్లు ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ సంస్థకు బదిలీ అయ్యాయి. మరో రూ.4.75 కోట్లు ఆంధ్రప్రభ ఎండీ ముత్తా గౌతమ్ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. అతడికి అందిన రూ.4.75 కోట్లలోనుంచి అభిషేక్ బోయినపల్లికి ముత్తా గౌతమ్ రూ.3.85 కోట్లు బదిలీ చేసినట్లు తేలింది. ఈ అన్ని లావాదేవీలు కూడా చెల్లించిన ముడుపులను తిరిగిరాబట్టుకోవడంలో భాగమేనని కోర్టు అభిప్రాయపడింది. కాగా, ఈడీ సమర్పించిన మౌఖిక, డాక్యుమెంటరీ ఆధారాల ప్రకారం ఈ కేసులో అరుణ్ పిళ్లై ప్రధాన నిందితుడని ప్రాథమికంగా రుజువు చేస్తోందని కోర్టు స్పష్టం చేసింది. సౌత్ గ్రూపునకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు సమావేశాల్లో పాల్గొన్నారని తెలిపింది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో జరిగిన దాదాపు అన్ని సమావేశాల్లో ఆయన పాల్గొన్నట్లు ఈడీ సమర్పించిన ఆధారాలు సరిపడా ఉన్నాయని పేర్కొంది.
ఒబెరాయ్ హోటల్‌లో..
2022 ఏప్రిల్‌లో ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో జరిగిన విజయ్ నాయర్, కవిత మధ్య జరిగిన భేటీలోనూ ఆయన పాల్గొన్నట్లు కోర్టు గుర్తించింది. ‘మద్యం విధానం రూపకల్పన, అమలు సమయంలో సౌత్ గ్రూపునకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు గోరంట్ల, మద్యం వ్యాపారీ బినయ్ బాబు ప్రాతినిధ్యం వహించినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, సాక్ష్యాధారాల ప్రకారం ఢిల్లీ మద్యం విధానం కేసులో పిళ్లై ప్రమేయం ఉందని ప్రాథమికంగా నిర్ధారిస్తున్నామని, కాబట్టి ఆయన బెయిల్‌పై విడుదలకు అర్హుడు కాదని’ కోర్టు పేర్కొంది. కాగా విచారణ సందర్భంగా ఈడీ తరఫున సీనియర్ న్యాయవాది జోహెబ్ హొస్సైన్ వాదిస్తూ.. ఈ కేసులో అరుణ్ పిళ్లై కీలక నిందితుడని, మద్యం విధానం రూపకల్పన, అమలు ఉల్లంఘనకు సంబంధించిన కుట్రలో భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. ఆ మ్ ఆద్మీ పార్టీ కమ్యునికేషన్ల ఇన్‌చార్జి విజయ్ నాయర్‌కు రూ.100 కోట్ల మేర ముడుపులు చెల్లింపుతో పాటు వాటిని తిరిగి రాబట్టుకునేదానిలోనూ కీలకంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఇండోస్పిరిట్స్ రూ. 192 కోట్లు లాభాలు ఆర్జించింది. ఆ సంస్థలో పిళ్లై కేవలం రూ. 3.4 కోట్లు పెట్టుబడులు పెట్టి రూ. 32.86 కోట్ల మేర లాభాలను పొందారు. ఆయన పెట్టిన పెట్టుబడుల మొత్తం కూడా కవిత ఇవ్వడమో లేదా ఆమె సూచనల మేరకో జరిగింది. కవిత తరఫున ప్రతినిధిగా ఆస్తులు కొనుగోలుకు సంబంధించిన లావాదేవీల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.