Visakhapatnam: మనిషి చేపలను తినడం సహజమే. కానీ చేప మనిషి పై దాడి చేయడం ఓ విచిత్రమే. ఇది ఎప్పుడు జరగని సంఘటన. దీంతో అందరిలో ఆశ్చర్యం వేస్తోంద. సముద్రానికి వేటకు వెళ్లిన వ్యక్తిని చేప దాడి చేయడం విస్తుగొలుపుతోంది. దీంతో అతడి ప్రాణాలు పోవడం మరో విచిత్రం. కలియుగం అంతమైపోతోందా అనే నుమానాలు అందరిలో వస్తున్నాయి. బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఒక్కోటి జరగడం చూస్తూనే ఉన్నాం. చేపను పట్టుకోవడానికి సముద్రంలోకి దిగిన జాలరిపై చేప ఎదురు దాడి చేసింది. దీంతో దాని ముళ్లు అతడి కడుపులో దిగడంతో అతడిని తీరం చేర్చే క్రమంలోనే ప్రాణాలు పోవడం దారుణం.
పరవాడ మండలం ముత్యాలపాలెం సమీపంలోని జాలరిపేటలో తాజాగా చేపల వేట కోసం వొల్లి జోగన్న మరికొందరితో పాటు వెళ్లాడు. రాత్రంతా చేపల వేట కొనసాగించారు. తెల్లవారు జామున ఓ పెద్ద చేప కనిపించడంతో జోగన్న దాని కోసం సముద్రంలో దూకాడు. దాన్ని పట్టుకునే క్రమంలో అది జోగన్నపై దాడి చేసింది. దీంతో దాని ముళ్లు జోగన్న కడుపులో దిగడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తోటి మత్స్యకారులు అతడిని తీరం చేర్చేందుకు తీసుకొచ్చేందుకు తిరిగి ప్రయాణం చేశారు.
Also Read: ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు.. ఖాతాల్లోకి ఏకంగా రూ.2 లక్షలు?
కానీ చేపకు ఉన్న ముళ్లుకు ఉన్న విషంతో జోగన్న ఎక్కువ సేపు ప్రాణాలతో ఉండలేకపోయాడు. తీరం దాదాపు 90 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్లడంతో వారు ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పట్టింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన చేప కొమ్ముకోణం అనే జాతికి చెందినదని తెలుస్తోంది. దీంతో జోగన్న విగత జీవిగా మారాడు.
జోగన్నను తీరం చేర్చేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. దీంతోనే అతడు చనిపోయాడు. దీనిపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేప కొమ్ముకు ఉన్న విషంతోనే అతడి శరీరం విషతుల్యం అయినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా జరగడం తొలిసారని చెబుతున్నారు. చేప దాడిలో మనిషి ప్రాణాలు పోవడం ఓ విచిత్రమే. జోగన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేపల వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు కూడా భయపడుతున్నారు. ఇలాంటి చేపలుంటాయనేది వారిలో కూడా భయం గొలుపుతోంది.
Also Read: ట్రావెల్ బ్యాగ్ లో అమ్మాయిని బాయ్స్ హాస్టల్ కు తీసుకెళ్లిన స్టూడెంట్.. చివరికి ట్విస్ట్