https://oktelugu.com/

బ్రేకింగ్: తగలబడుతున్న తెలంగాణ భవన్

సంబరాలు శృతి మించాయి. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించడంతో ఆ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే వాణిదేవి విజయం పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. టపాసులు పేల్చుతుండగా టీఆర్ఎస్ భవన్ లోని పైకప్పుకు మంటలు అంటుకున్నాయి. దీంతో భవనం పైకప్పులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. మంటలను ఆర్పించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గెలుపు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 20, 2021 / 06:46 PM IST
    Follow us on

    సంబరాలు శృతి మించాయి. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించడంతో ఆ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే వాణిదేవి విజయం పట్ల టీఆర్ఎస్ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది.

    టపాసులు పేల్చుతుండగా టీఆర్ఎస్ భవన్ లోని పైకప్పుకు మంటలు అంటుకున్నాయి. దీంతో భవనం పైకప్పులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ అక్కడి నుంచి పంపించేశారు.

    మంటలను ఆర్పించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గెలుపు సంబరాల్లో భాగంగానే బాణాసంచా కాల్చడంతోనే ఈప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు.

    ఇక అంతకుముందు కార్యకర్తలు, నేతలు స్వీట్లు పంపిణి చేసుకున్నారు. టపాసులు కాల్చగా భవనం పైఅంతస్తున్న ఎండుగడ్డికి మంటలు అంటుకున్నాయి. మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.