Financial Planning
Financial Planning : ప్రతి ఒక్కరూ లగ్జరీగా బతకాలని కోరుకుంటారు. కోటీశ్వరులు కావాలని కలలు కంటుంటారు. అందుకే యువతీ, యువకులు తొలిసారి జీతం అందుకోగానే ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లు ఫీలవుతారు. ఖర్చు చేయాలనే ఉత్సాహం వారిలో పెరిగిపోతుంది. ఎవరైతే సరైన పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే కోటీశ్వరులు అయిపోవచ్చు. అనవసరంగా వచ్చిపడే ఖర్చులు మనకు డబ్బు అవసరాన్ని తెలియజేస్తాయి. ఆ సమయంలో మనకు ఇబ్బంది కలగకూడదనుకుంటే.. స్వేచ్ఛగా బతకాలంటే.. వెంటనే సురక్షితమైనవి భావించే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులపై దృష్టి సారించాలి. ప్రతి వ్యక్తి నెలకు రూ.5,000 మదుపు చేస్తూ.. వెళ్తూ.. ఏటా 10శాతం చొప్పున పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటే పోతే.. అప్పుడు మొత్తం పెట్టుబడి రూ.1,62,61,462 అవుతుంది. దీనిపై అదే 12శాతం రాబడితో అక్షరాలా రూ.8,88,34,698. దీని బట్టి చూస్తే కోటీశ్వరులు కావడం పెద్ద విషయమేమీ కాదు.
ఒకేసారి పెట్టుబడి పెట్టి 30 ఏళ్ల తర్వాత తీసుకోవాలని ఆలోచిస్తున్నారా… ఇప్పుడు రూ.లక్ష ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టి… సగటున ఏటా 12 శాతం రాబడి వస్తుందని భావిస్తే అప్పటికి రూ.29.95 లక్షలు అవుతాయి. 28 ఏళ్ల వ్యక్తి ఏటా రూ.లక్ష చొప్పున… 30 ఏళ్లపాటు మదుపు చేస్తే చాలు.. పదవీ విరమణ తర్వాత మంచి మొత్తాన్ని రాబట్టుకోవచ్చు. సదరు వ్యక్తి జీతం నెలకు రూ.50,000 అనుకుంటే నెలకు రూ.15,000సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచ్‌వల్ ఫండ్లలో పొదుపు చేసుకోవచ్చు. ఈ లెక్కన పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.27,00,000 అవుతుంది. దీనిపై రాబడి రూ.74,52,946. దీంతో ఖాతాలో రూ.1,01,52,946 ఉంటుంది.
నెలకు రూ.15,000లతో పెట్టుబడి ప్రారంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళితే… అప్పుడు మొత్తం పెట్టుబడి రూ.57,19,047 అవుతుంది. దీనిపై 15 శాతం రాబడి అంచనాతో రూ.1,09,30,946 మొత్తం అందుతుంది. అంటే రూ.1,66,49,992 జమ అవుతుందన్నమాట. ఇలా మరో 5 ఏళ్లు అధికంగా కొనసాగిస్తే ఆ మొత్తం రూ.4,17,54,468లకు చేరుతుంది.. అదే ఇంకో 5 ఏళ్లపాటు అంటే.. 25 ఏళ్లపాటు పెట్టుబడి పెడుతూ పోతే జమయ్యే మొత్తం రూ.9,87,26,200 అవుతుంది.
పెట్టుబడి పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు కావాలేమోనని అనుకుంటారు చాలా మంది. పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన, క్రమశిక్షణ ఉంటే చాలు పెద్ద మొత్తం అవసరం లేదు. ఆదాయంలో కనీసం 20 శాతం పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకుంటే చాలు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో రూ.1,000తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అటు మ్యూచువల్ ఫండ్లలోనూ, ఇటు పోస్టాఫీసుల్లోనూ ఎన్నో పథకాలు ప్రస్తుతం మధ్య తరగతి ప్రజల కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వందల కొద్ది ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి, లక్ష్యాలు, పెట్టుబడికి ఉన్న కాలం, నష్టభయం భరించే సామర్థ్యం ఆధారంగా ఫండ్లను సెలక్ట్ చేసుకోవాలి. అనుభవం ఉన్న నిపుణుల సలహా తీసుకోవాలి.
ఆహారం, ఇల్లు.. నిత్యావసరాలు.. ప్రయాణాలు.. అత్యవసరం.. ఇతర ఖర్చులు… జీవితాంతం ఉంటూనే ఉంటాయి. బతికి ఉన్నంత కాలం వీటి మీద ఖర్చులు తప్పవు. నేటి ఖర్చులు.. రేపటికి పెరుగుతాయి. మరి అప్పుడు ఎలా? వీటికి అదనంగా కొన్ని యాడ్ అవుతుంటాయి. అవే.. పదవీ విరమణ ప్రణాళిక. పిల్లల భవిష్యత్తు. సొంతిల్లు. కారు కొనుగోలు… ఇవన్నీ సాధించేందుకు పెట్టుబడులు అవసరం.. ద్రవ్యోల్బణం మన కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. దీన్ని తట్టుకునేందుకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.
అందుకే చిన్న వయసు నుంచే పెట్టుబడులను ప్రారంభించాలి. అప్పుడు నష్టభయం భరించే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఆర్థిక బాధ్యతలు తక్కువగా ఉండడం ఇక్కడ కలిసొచ్చే అంశం. దీంతో అధిక నష్టభయం ఉన్న పెట్టుబడులను ఎంచుకుని, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులను ప్రారంభించిన కొత్తలో మంచి రాబడి వచ్చినట్లు అనిపించదు. కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితంగా పెట్టుబడులపై సగటు వార్షిక రాబడి పెరుగుతుంది.
అలాగే పాత పన్ను విధానంలో ట్యాక్స్ ల్లో మినహాయింపు పొందాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి అవకాశం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం వివిధ పథకాల్లో మదుపు చేసి, రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. పెట్టుబడిపై అధిక రాబడిని ఆర్జిస్తూ, పన్ను ఆదా చేసుకోవాలనుకున్న వారికి ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్) చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న వయసులోనే పెట్టుబడుల ప్రయాణం ప్రారంభించినప్పుడు, స్టాక్ మార్కెట్ల గురించి అనుభవం పొందవచ్చు. లాభనష్టాలు రెండింటి నుంచీ నేర్చుకోవచ్చు.
చిన్న వయసు నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. మీ ఖర్చు అలవాట్లలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఏది అవసరం, ఏది వాయిదా వేయొచ్చు.. అనే ఆలోచన పెరుగుతుంది. ప్లాన్ చేసి ఖర్చు చేయడం తెలిస్తే.. ఆదాయంలో మిగులు పెరుగుతుంది. వచ్చిన జీతంలో వీలైనంత పెట్టుబడులకు మళ్లించి మంచి రాబడి పొందవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో రూ.100తోనూ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండే బదులు..చిన్న మొత్తంతోనూ పెట్టుబడులు ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి. కంపెనీలు ఐపీఓకి వచ్చినట్లే.. మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త ఫండ్లను తీసుకొస్తూనే ఉంటాయి. వీటిని న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌ఓ)గా పేర్కొంటారు. ఇందులో రూ.100 నుంచి రూ.5,000 వరకూ పెట్టుబడి పెట్టవచ్చు.
పెట్టుబడి మొత్తం సురక్షితంగా ఉండాలి.. కచ్చితమైన రాబడి హామీ ఉండాలి అని భావించే వారికీ బంగారం కూడా మంచి ఎంపిక. భారతీయులు బంగారాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తారు. ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి బంగారం కూడబెట్టడం ప్రారంభిస్తారు. నిత్యం ధర కూడా పెరుగుతున్నందున దానిని సమకూర్చుకోవడం మంచిదే అని పెద్దల మాట. ప్రస్తుత యువత బంగారం కొనుగోలునూ పెట్టుబడిగానే చూస్తున్నారు. 24 క్యారెట్ల నాణ్యత బంగారం బిస్కెట్/నాణేల రూపంలో కొనుగోలు చేద్దామా లేక కమొడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇలా తమ సంపాదనలో ఎంతో కొంత పెట్టుబడులు పెట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లైతే చిన్న వయసులో కోటీశ్వరులు కావడం పెద్ద కష్టమేమీ కాదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Financial planning money doesnt just come to anyone do you know what to do if you want to become a millionaire quickly
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com