KCR Delhi Tour Ends: జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పన కోసం దేశ పర్యటనకు బయల్దేరిన టీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సడెన్ బ్రేక్ వేసింది. అర్ధంతరంగా తన పర్యటన ముగించుకోవాల్సిన పరిస్థితి తెలెత్తింది. దీంతో సోమవారం రాత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు.

జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించడమే ధ్యేయంగా దేశవ్యాప్త పర్యటనకు ఈనెల 20 కేసీఆర్ బయల్దేరారు. 27వ తేదీ వరకు కొనసాగాల్సిన పర్యటన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే ముగించుకోవాల్సి వచ్చిందని సమాచాం. తెలంగాణ అప్పులపై కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. రాష్ట్ర అధికారులు రోజుల తరబడి ఢిల్లీలో మకాంవేసినా కేంద్రం కనికరించలేదు. నిధులు లేని దుస్థితిలో ప్రాజెక్టులు, పథకాలు నిలిచిపోయే పరిణామాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని చక్కబెట్టేందుకు అనూహ్యంగా తన పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Akhanda 2: అఖండ 2 గురించి అభిమానులకు సెన్సేషనల్ న్యూస్
యథావిధిగా బెంగళూర్, షిర్డీ పర్యటన..
సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు ఆటంకం కలిగినా ఈనెల 26 బెంగళూరు, 27న రాలెగావ్ సిద్దికి పర్యటన యథావిధిగా కొనసాగుతుందని సీఎంవో పేర్కొంది. 26న జనతాదళ్ ఎస్ నేత, మాజీ ప్రధాని దేవగౌడ, 27న అన్నహజారేతో భేటీ ఉంటుందని తెలిపింది. తర్వాత షిర్డీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుంటారని పేర్కొంది. ఈనెల 26న మోదీ హైదరాబాద్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయన రాకముందే కేసీఆర్ తిరిగి ఢిల్లీ వెళతారని పార్టీ నేతలు అంటున్నారు.
29న మళ్లీ ఢిల్లీకి..?
సీఎంవో షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఈనెల 27న హైదరాబాద్ తిరిగొచ్చి, 29, 30 తేదీల్లో బెంగాల్, బిహార్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, కేసీఆర్ çపర్యటనక సడెన్ బ్రేక్ పడిన నేపథ్యంలో బెంగాళ్, బీహార్ పర్యటనపై అనుమానాలు వ్యక్తమువున్నాయి. కానీ 29న బెంగాల్, 30న బీహార్ పర్యటన ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

మమత నిరాకరించిందా?
సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు మమతా బెనర్జీ సుముఖత చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ జాతీయ ఎజెండాను ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలు నమ్మడం లేదు. కేసీఆర్ మాత్రం అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకునే ప్రయత్నాలు మొదులు పెట్టారు. మొదట ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులను కలిశారు, పంజాబ్ రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు. రాజకీయ నేతలతో రాజకీయాలే చర్చిస్తామని కూడా మీడియాకు చెప్పారు. కానీ కేసీఆర్ ఒక్కరే మీడియాతో మాట్లాడడం, కేజ్రీవాల్ మౌనం పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా కేజ్రీవాల్ బాటలోనే నడుస్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌ను కలిసేందుకు ఆమె విముఖత చూపడంతోనే కేసీఆర్ పర్యటన అర్ధంతరంగా ముగిసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read:Malla Reddy vs Revanth Reddy: మల్లారెడ్డి వ్యాపారాలను రేవంత్ అందుకే టార్గెట్ చేస్తున్నారా!?

[…] […]