పార్టీల మధ్య కొట్లాట పెడుతున్న ఎస్‌ఈసీ

ఏపీ ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ మార్చి నెలాఖరులో రిటైర్డ్‌ కాబోతున్నారు. కానీ.. ఆయన మాత్రం తన హయాంలోనే రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావాలనే పంథాలో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పంచాయతీ పోరు నిర్వహిస్తుండగా.. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల ఫైట్‌ షురూ కాబోతోంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ పోతూపోతూ పార్టీల మధ్య తండ్లాట పెట్టాలని చూస్తున్నారా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. Also Read: జగన్‌ వ్యూహంలో టీడీపీ […]

Written By: Srinivas, Updated On : February 20, 2021 11:50 am
Follow us on


ఏపీ ఎన్నికల కమిషనర్‌‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ మార్చి నెలాఖరులో రిటైర్డ్‌ కాబోతున్నారు. కానీ.. ఆయన మాత్రం తన హయాంలోనే రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు పూర్తి కావాలనే పంథాలో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పంచాయతీ పోరు నిర్వహిస్తుండగా.. మరికొద్ది రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల ఫైట్‌ షురూ కాబోతోంది. ఈ క్రమంలో నిమ్మగడ్డ పోతూపోతూ పార్టీల మధ్య తండ్లాట పెట్టాలని చూస్తున్నారా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

Also Read: జగన్‌ వ్యూహంలో టీడీపీ చిక్కుకుందా..?

పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే ఏ ప్రభుత్వమైనా ఏకగ్రీవాల కోసం ప్రయత్నించడం కామన్‌. కానీ.. ఈయన ఏక‌గ్రీవాల‌పై ఫిర్యాదులు చేయాల‌ని కోర‌డంపై విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్ఈసీ చ‌ర్యల‌తో కొంద‌రిలో లేని ఆశ‌లు రేకెత్తించ‌డంతోపాటు ప్రలోభాల‌కు తెర‌లేపిన‌ట్టైంద‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది అర్ధంతరంగా ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు నిలుపుద‌ల చేసిన నేప‌థ్యంలో నిమ్మగ‌డ్డ వ్యవ‌హార శైలిపై రాజ‌కీయ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి.

ఏకగ్రీవమై.. ఎన్నికల అధికారి ఫాం 10 జారీ చేసిన తర్వాత ఆ ఎన్నిక చెల్లదు అంటే ఏ మాత్రం కుదరదు. ఒక‌వేళ ఎన్నిక స‌రైంది కాద‌ని ఎవ‌రైనా భావిస్తే, దాన్ని న్యాయ‌స్థానంలో నిరూపించాల్సి ఉంటుంది. ఈ విష‌యాల‌న్నీ తెలిసి కూడా నిమ్మగ‌డ్డ అడ్డదిడ్డంగా ఉత్తర్వులు జారీ చేయ‌డం ఏంట‌నే నిర‌స‌న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలు డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

Also Read: పంచాయతీ పోరులో రాజకీయ దుమారం

ఈ సంద‌ర్భంగా పిటిష‌న్ల త‌ర‌పు న్యాయ‌వాదులు ఎస్ఈసీ ఏక‌ప‌క్ష ధోర‌ణుల‌ను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయ‌ని పిటిష‌న‌ర్ల త‌ర‌పు న్యాయ‌వాది మోహ‌న్‌రెడ్డి వాదించారు. కానీ.. ఎన్నికల కమిషనర్‌ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్‌మ్యాన్‌లా వ్యవహరిస్తున్నార‌ని ఆయ‌న న్యాయ‌స్థానానికి నివేదించారు. పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన విష‌యాన్ని గుర్తు చేస్తూ…ఈ నెల 23వ తేదీ వ‌ర‌కూ ఎలాంటి విచార‌ణ జ‌ర‌ప‌వ‌ద్దని ఆదేశించింది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్