Chandrababu: ఫైబర్ నెట్ కేసు : చంద్రబాబు, అనుచరులకు గట్టి షాక్

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 29 పవర్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. అందులో ఒకటి రెండు కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. 33,240 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా వీటిని నిర్మాణాలు జరుగుతున్నాయి. 29 పంప్డు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది.

Written By: Dharma, Updated On : November 22, 2023 3:24 pm

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పారిశ్రామిక అభివృద్ధి జరగలేదని ఒకవైపు ఆరోపిస్తున్నారు. పరిశ్రమలు పెడుతున్న వారు అస్మదీయులని కామెంట్స్ చేస్తున్నారు. పరిశ్రమల విషయం పక్కన పెడితే ” పవర్” విషయంలో మాత్రం ఏపీ ముందు వరసలో నిలవడం అభినందనీయం. పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం భావితరాలకు ఇబ్బంది లేకుండా చేయడమే.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 29 పవర్ ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి. అందులో ఒకటి రెండు కొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. 33,240 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా వీటిని నిర్మాణాలు జరుగుతున్నాయి. 29 పంప్డు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ల ఏర్పాటు శరవేగంగా జరుగుతోంది. ఇందులో 2024 నాటికే కొన్ని అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడేలా ఏకీకృత పునరాత్పాదక విద్యుత్ ప్రాజెక్టును గ్రీన్ కో చేపడుతోంది. దీని ద్వారా సౌర, పవన, హైడల్ విధానాల్లో 24 గంటలూ క్లీన్ విద్యుత్ అందుతుంది. కాలుష్య రహితంగా, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ఇది రూపుదిద్దుకుంటుంది.

పర్యావరణ సమతుల్యత, కాలుష్య రహితం ఇప్పుడు కీలకం. అందుకే దేశంలోని ఎక్కడా లేనివిధంగా గ్రీన్ పవర్ ఉత్పాదక సంస్థలకు ఏపీలో రాయితీలు, ప్రోత్సాహకాలు అందుతున్నాయి. మొత్తం 33 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది.అయితే పవర్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ దేశానికి దిక్సూచిగా నిలవనుంది. రాష్ట్ర అవసరాలకు పోను.. భవిష్యత్తులో దేశ అవసరాలను తీర్చనుంది. ఓ ఉత్తమ పవర్ ప్రాజెక్టుగా నిలవనుంది. కానీ ఎందుకో ఈ పవర్ ప్రాజెక్టుల విషయంలో వైసిపి ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోతోంది. చేసిన పనిని కూడా చెప్పుకోలేకపోతోంది.