https://oktelugu.com/

ఫెవికాల్ ప్రకటన: నీ క్రియేటివిటీ సూపరబ్బా

ఫెవికాల్ యాడ్స్ టీవీలో వస్తుంటే వారి క్రియేటివిటీకి, రూపొందించిన కామెడీ టైమింగ్ కు నవ్వకుండా ఉండలేరు. అంతగొప్పగా మార్కెట్ స్ట్రాటజీలతో ప్రకటనలు రూపొందించి ప్రజల నోళ్లలో నాని ఫెవికాల్ బలంగా తయారైంది. ‘ఫెవికాల్ బంధం వేస్తే ఇక తెంచుకోలేరు’ అన్నట్టుగా ఈ ప్రకటన చాలా పాపులర్ అయ్యింది. తాజాగా యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ సందర్భంగా ప్రపంచ మేటి ఫుట్ బాల్ క్రీడాకారుడు రోనాల్డో చేసిన పనికి కోకా కోల షేర్లు కుప్పకూలి ఆ కంపెనీకి దాదాపు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2021 / 07:45 PM IST
    Follow us on

    ఫెవికాల్ యాడ్స్ టీవీలో వస్తుంటే వారి క్రియేటివిటీకి, రూపొందించిన కామెడీ టైమింగ్ కు నవ్వకుండా ఉండలేరు. అంతగొప్పగా మార్కెట్ స్ట్రాటజీలతో ప్రకటనలు రూపొందించి ప్రజల నోళ్లలో నాని ఫెవికాల్ బలంగా తయారైంది. ‘ఫెవికాల్ బంధం వేస్తే ఇక తెంచుకోలేరు’ అన్నట్టుగా ఈ ప్రకటన చాలా పాపులర్ అయ్యింది.

    తాజాగా యూరోపియన్ ఫుట్ బాల్ లీగ్ సందర్భంగా ప్రపంచ మేటి ఫుట్ బాల్ క్రీడాకారుడు రోనాల్డో చేసిన పనికి కోకా కోల షేర్లు కుప్పకూలి ఆ కంపెనీకి దాదాపు 29వేల కోట్ల నష్టం వాటిల్లింది. రోనాల్డో తన ముందున్న కోకాకోలా బాటిల్స్ ను అసహనంతో పక్కకు పడేసి మంచినీళ్లు తాగండి మంచిందంటూ సూచించడం మీడియాలో వైరల్ అయ్యింది. ఇది కోకాకోలా కంపెనీని చావుదెబ్బ తీసింది.

    ఈ వివాదాన్ని అనుకూలంగా మలుచుకున్న భారత్ లోని ప్రముఖ గమ్ కంపెనీ ఫెవికాల్ తాజాగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. ‘ప్రెస్ కాన్ఫరెన్స్ టేబుల్ పై కోక్ బాటిళ్ల బదులు రెండు ఫెవికాల్ బాటిళ్లను ఉంచి .. ‘దీన్ని ఎవరూ జరపలేరు.. దీని విలువ పడిపోదు’ అనే వ్యాఖ్యను జోడించింది. దీనిపై నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి. ఫెవికాల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

    ఫెవికాల్ అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహంతో ఈ ప్రకటన చేసిందని.. దానికి సృజనాత్మకత కు హ్యాట్సాఫ్ అంటూ తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గోయెంకా ట్వీట్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.