పాత, కొత్త.. ఇదే కాంగ్రెస్ కు శాపమవుతోందా?

100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. దేశంలో మెజార్టీ ప్రధానులను ఇచ్చిన పార్టీ.. ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ ఇప్పుడు బీజేపీ ధాటికి కకావికలం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి రావడానికి పాత, కొత్త నేతల మధ్య వైరమే అసలు కారణంగా చెప్పవచ్చు. ఈ పంచాయితే కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేస్తోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా? కాంగ్రెస్ వ్యవహారాలు ఇప్పుడు దేశంలో పూర్తి గందరగోళంగా మారాయి. […]

Written By: NARESH, Updated On : August 2, 2020 4:04 pm
Follow us on


100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. దేశంలో మెజార్టీ ప్రధానులను ఇచ్చిన పార్టీ.. ఎన్నో సంవత్సరాలు పాలించిన పార్టీ ఇప్పుడు బీజేపీ ధాటికి కకావికలం అవుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితికి రావడానికి పాత, కొత్త నేతల మధ్య వైరమే అసలు కారణంగా చెప్పవచ్చు. ఈ పంచాయితే కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేస్తోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?

కాంగ్రెస్ వ్యవహారాలు ఇప్పుడు దేశంలో పూర్తి గందరగోళంగా మారాయి. పార్టీకి పూర్తి సమయం అధ్యక్షుడు లేనందున ఆ బాధ్యతలను సంవత్సరం నుంచి సోనియా గాంధీ మోస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ లను మార్చలేక కాంగ్రెస్ లో క్యాడర్, నేతలు నిరుత్సాహంలో పడిపోతున్నారు. నాయకత్వం లేక కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది.

ప్రస్తుతం సోనియా గాంధీ తన కొడుకుకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ రాహుల్ మాత్రం కాంగ్రెస్ వృద్ధ జంబూకాలను పార్టీలో రిటైర్ మెంట్ ప్రకటించి యువతకు అవకాశాలు ఇస్తేనే తాను అధ్యక్ష పదవిని తీసుకుంటానని అంటున్నారు. దీంతో సోనియా ఆ పనిచేయడం లేదు. సీనియర్లను వదలుకోలేక.. యువతకు అధికారాలు, పార్టీని అప్పగించలేక ఆమె రాహుల్ నే పక్కనపెడుతున్నారు.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

సోనియా చుట్టే పాత సీనియర్లు చేరి పార్టీ ప్రక్షాళన చేయకుండా ఆమెకు నూరిపోస్తున్నారన్న చర్చ ఆ పార్టీలో ఉంది. అందుకే రాహుల్ గాంధీని అధ్యక్షుడిని చేస్తే కొత్త యువ నాయకత్వం కాంగ్రెస్ లో వస్తుందని.. తమ పప్పులు ఉడకవని.. అందుకే సోనియా ముందరి కాళ్లకు సీనియర్ నేతలు బంధం వేస్తున్నారని అంటున్నారు.

దీంతో ఈ సంవత్సరంలో అనేక రాష్ట్రాల్లో యువ నేతలు సింధియా, సచిన్ పైలట్ లాంటి వాళ్లు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. రాహుల్ గనుక అధ్యక్ష బాధ్యతల్లో ఉండి వుంటే వీరే ఆ రాష్ట్రాల సీఎంలు అయ్యిండేవారు.ఇప్పటికైనా సోనియా, రాహుల్ లు కలిసి కూర్చొని పాత సీనియర్లకు మంగళం పాడి పార్టీలో యువనేతలకు అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి.