చైనాకు మరో భారీ దెబ్బ

కరోనాను పుట్టించిన పాపం చైనాకు ఊరికే పోవడం లేదు. అంతేకాకుండా సామ్రాజ్యవాదంతో భారత్ సహా పొరుగుదేశాలపైకి దండెత్తడంతో ఇక ప్రపంచం దృష్టిలో చైనా విలన్ అయ్యింది. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. వరుసగా చైనాకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. భారత్ తో కయ్యానికి కాలుదువ్వడంతో మన దేశం ఏకంగా 59 చైనా యాప్స్ పై నిషేధం విధించి ఆర్థికంగా దెబ్బతీసింది. పలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఇలా చైనా ఆర్థిక మూలాలను కదిలించే చర్యలకు దిగడం.. […]

Written By: NARESH, Updated On : August 2, 2020 5:58 pm
Follow us on


కరోనాను పుట్టించిన పాపం చైనాకు ఊరికే పోవడం లేదు. అంతేకాకుండా సామ్రాజ్యవాదంతో భారత్ సహా పొరుగుదేశాలపైకి దండెత్తడంతో ఇక ప్రపంచం దృష్టిలో చైనా విలన్ అయ్యింది. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటోంది. వరుసగా చైనాకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. భారత్ తో కయ్యానికి కాలుదువ్వడంతో మన దేశం ఏకంగా 59 చైనా యాప్స్ పై నిషేధం విధించి ఆర్థికంగా దెబ్బతీసింది. పలు కాంట్రాక్టులను రద్దు చేసింది. ఇలా చైనా ఆర్థిక మూలాలను కదిలించే చర్యలకు దిగడం.. అటు అమెరికా కూడా ఇదే పనిలో హెచ్చరికలు పంపడంతో చైనా మన దేశ సరిహద్దుల నుంచి వెనక్కి వెళ్లిపోయింది.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

ఇప్పుడు చైనాను అమెరికా దేశం అంత ఈజీగా వదిలేలా కనిపించడం లేదు. అమెరికా కూడా టిక్ టాక్ తోపాటు పలు చైనా యాప్ లను బ్యాన్ చేయడానికి సిద్దమైంది.తాజాగా చైనాకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా చైనాకు భారీ షాక్ ఇచ్చింది. తన యాప్ స్టోర్ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్ ను తొలగించింది. వీటిల్లో 26వేలకు పైగా యాప్స్ గేమ్స్ కు చెందినవి కావడం విశేషం. ఈ గేమింగ్ పేరుతో వ్యక్తుల డేటా చోరీ చేస్తోందని ఆ సంస్థపై ఆరోపణలున్నాయి.

గత ఏడాది యాపిల్ సంస్థ గేమింగ్ యాప్స్ రూపొందించే సంస్థలకు ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ లు సమర్పించాలని కోరింది. దీనికి డెడ్ లైన్ ను జూన్ వరకు పెట్టింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాజాగా యాపిల్ తన ప్లేస్టోర్ నుంచి ఈ 29వేల చైనీస్ యాప్స్ ను తొలగించింది.

Also Read: పాత, కొత్త.. ఇదే కాంగ్రెస్ కు శాపమవుతోందా?

ఇక గత నెల మొదటి వారంలోనే సుమారు 2500కు పైగా యాప్స్ ను యాపిల్ సంస్థ తొలగించింది. ఇలా చైనా దుర్భిద్దికి ప్రపంచవ్యాప్తంగా ప్రతి చర్యలు మొదలయ్యాయి. ఇలానే వ్యవహరిస్తే మరిన్ని ఆర్థిక మూలాలు కూడా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది.