Female Alcohol Consumption: మద్యం తాగడంలో పురుషులు మహిళల కంటే ముందున్నారనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ అభిప్రాయం. కానీ అదంతా గతంలో ఇప్పుడు కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మార్చేశారు కొందరు మహిళలు. మహిళలు కూడా పురుషులతో సమానంగా మద్యం తాగుతున్నారు. అంతే కాదు, మహిళలు పురుషుల కంటే వేగంగా కూడా మద్యాన్ని తాగుతున్నారు.
గతంలో మహిళలు మద్యం పరిశ్రమకు ఒక మాధ్యమంగా ఉండేవారు, అంటే వారి వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, ప్రకటనలలో మహిళలు పురుషులకు మద్యం అమ్ముతున్నట్లు చూపించేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రకటనలు కూడా మారాయి. పరిశ్రమ ఇప్పుడు మద్యపానాన్ని మహిళల స్వేచ్ఛ, స్వేచ్ఛా ఆలోచనలతో అనుసంధానిస్తూ ప్రకటనలు చేస్తుంది. అయితే మహిళ అయినా పురుషుడు అయినా ఎవరైనా సరే శరీరానికి హాని మాత్రం తప్పుదు. గతంలో WHO తెలిపిన నివేదిక ప్రకారం మద్యం సేవించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 26 లక్షల మంది మరణిస్తున్నారట.
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మహిళలు మద్యానికి ఎక్కువ బానిసలు అయ్యారట. ఇంటి పనుల ఒత్తిడి అని చెబుతారు. మరోవైపు, ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు మద్యానికి బానిసలైతే, దాన్ని వదిలించుకోవడం కష్టం. ఇక కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఢిల్లీలో కమ్యూనిటీ అగైన్స్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ (CADD) ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో, 37% కంటే ఎక్కువ మంది మహిళలు గత మూడు సంవత్సరాలలో తమ మద్యపాన వ్యసనం పెరిగిందని అంగీకరించారు. ఈ సర్వే ప్రకారం, 45% కంటే ఎక్కువ మంది మహిళలు మద్యానికి బానిస కావడానికి ఒత్తిడి కారణమని చెప్పారు. 30.1% మంది మహిళలు విసుగును వదిలించుకోవడానికి మద్యం తాగడం ప్రారంభించారట.
మద్యం సేవించేవారిలో మన దేశంలో 1.3 శాతం మహిళలు, 19 శాతం పురుషులు ఉన్నారు . గ్రామీణ భారతదేశంలో 1.6 శాతం మంది మహిళలు నగరాల్లో 0.6 శాతం కంటే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. రాష్ట్రాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో అత్యధికంగా మహిళలు మద్యం సేవించేది అరుణాచల్ ప్రదేశ్‌లో 24 శాతంగా ఉంది. దీని తరువాత, సిక్కింలో 16 శాతం, అస్సాంలో 7.3 శాతం, ఆ తర్వాత తెలంగాణలో 6.7 శాతం ఉన్నాయి.
జపాన్‌లో కూడా మద్యపాన వ్యసనం
జపాన్‌లోని మహిళల్లో అధిక మద్యం సేవించే ధోరణి వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో ఈ వ్యసనం తీవ్రంగా పెరుగుతోంది. ఈ వయస్సులో అధికంగా మద్యం సేవించే మహిళల సంఖ్య దశాబ్దంలో రెట్టింపు అయిందనేది వాస్తవం.
టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సర్వే ప్రకారం, అధిక మొత్తంలో మద్యం సేవించే మహిళల శాతం 17.7 శాతానికి పెరిగింది. ఈ సంఖ్య మొదటిసారిగా పురుషుల సంఖ్యను అధిగమించింది. సర్వే ప్రకారం, 2011లో, 14% మంది మహిళలు తమ ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో మద్యం సేవించగా, 2016లో ఈ సంఖ్య 15.5కి పెరిగింది. దీనికి విరుద్ధంగా, 2011లో 19%గా ఉన్న పురుషుల మద్యం సేవించే శాతం ఇప్పుడు 16.5%కి తగ్గింది.
ఈ సమస్యలు మద్యం వల్ల కలుగుతాయి
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్కహాల్ అండ్ హెల్త్ అండ్ ట్రీట్‌మెంట్ ఆఫ్ సబ్‌స్టాన్స్ యూజ్ డిజార్డర్స్ పై గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ప్రకారం, ఆల్కహాల్ వినియోగం కాలేయ వ్యాధుల నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యలను కలిగిస్తుంది. 2019లో ఆల్కహాల్ వల్ల సంభవించిన 26 లక్షల మరణాలలో 16 లక్షల మరణాలు క్యాన్సర్ (401,000), గుండె జబ్బులు (474,000) వంటి వ్యాధుల వల్ల సంభవించాయని కూడా నివేదిక నిర్ధారించింది. ప్రమాదాలు 7,24,000 మరణాలకు కారణమైతే, అంటు వ్యాధులు మూడు లక్షల మరణాలకు కారణం.
భారతదేశంలో యువత 5 లీటర్ల మద్యం తాగుతారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో భారతదేశానికి సంబంధించిన డేటాను కూడా పంచుకుంది. ఈ గణాంకాల ప్రకారం, 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సగటు భారతీయుడు సంవత్సరానికి 4.9 లీటర్ల మద్యం తాగుతున్నాడు. డేటా ప్రకారం, 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సగటు భారతీయ పురుషుడు ప్రతి సంవత్సరం 8.1 లీటర్ల మద్యం సేవిస్తున్నాడు. అయితే ఈ సంఖ్య మహిళల్లో 1.6 లీటర్లుగా నమోదైంది. అంటే సగటు భారతీయుడు ప్రతిరోజూ 10.7 గ్రాముల మద్యం సేవిస్తున్నాడని అర్థం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.