https://oktelugu.com/

బిగ్ బాస్-4: రచ్చ చేసిన అరియానా-మోహబూబ్.. ఈ వారం ఎవరు ఔట్?

బిగ్ బాస్ -4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత ఏడువారాలుగా ప్రసారమవుతున్న బిగ్ బాస్-4 సీజన్ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో మిగతా కంటెస్టుల మధ్య పోటీ నెలకొనడంతో గేమ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. Also Read: ‘800’ మూవీ నుంచి విజయ్ ను ఔట్ చేసిన మురళీధరన్..! ఏడోవారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ జంటలుగా ఉన్నవారికి విడగొట్టే ప్రయత్నం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 / 01:23 PM IST
    Follow us on

    బిగ్ బాస్ -4 సీజన్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గత ఏడువారాలుగా ప్రసారమవుతున్న బిగ్ బాస్-4 సీజన్ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. దీంతో మిగతా కంటెస్టుల మధ్య పోటీ నెలకొనడంతో గేమ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది.

    Also Read: ‘800’ మూవీ నుంచి విజయ్ ను ఔట్ చేసిన మురళీధరన్..!

    ఏడోవారం నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ జంటలుగా ఉన్నవారికి విడగొట్టే ప్రయత్నం చేశాడు. హౌస్ లోని కంటెస్టులకు ఇది పరీక్షగా మారినట్లు కన్పిస్తోంది. ఈ జంటల్లో కొందరు ప్రేమతో తమను తాము నామినేషన్ చేసుకోగా మరికొందరు వాదించుకున్నారు. వీటన్నింటిని చూస్తే  మరికొద్దిరోజుల్లో మనస్పర్థలు వచ్చేలా కన్పిస్తున్నాయి.

    నామినేషన్ ప్రక్రియలో భాగంగా అఖిల్.. మొనాల్ మధ్య చర్చ జోరుగా నడిచింది. అఖిల్ తాను స్ట్రాంగ్ కంటెస్టునని మోనాల్ తో చెప్పాడు. దీంతో మొనాల్ అఖిల్ కోసం తాను నామినేట్ అవుతున్నట్లు ప్రకటించింది. మెహబూబ్-అరియానా మాత్రం నామినేషన్ కోసం వాదోపవాదనలకు దిగారు. వీరిద్దరు గేమ్లో కొనసాగేందుకే పంతం పట్టడంతో వీరిలో ఎవరు నామినేషన్ అవుతారా? అనే ఆసక్తి నెలకొంది.

    అయితే మొహబూబ్ ఎలాగే తనకు సాయం చేయడని గుర్తించిన అరియానా చివరకు తానే నామినేట్ అవుతున్నట్లు ప్రకటించింది. తొలి నుంచి అరియానా గెలవాలన్న తపనతో ఆడుతోంది. అయితే ఈసారి మొహబూబ్ కారణంగా ఆమె నామినేట్ కావాల్సి వచ్చింది. ఇకపై తనకు సాయం చేయద్దంటూ మోహబూబ్ తో అంటూ బాధపడుతూ చెప్పింది.

    కిందటి వారమే మోహబూబ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా అప్పుడు కెప్టెన్ గా ఉన్న సోహైల్ అతడిని కాపాడాడు. తాజాగా మరోసారి నామినేషన్ ప్రక్రియను నుంచి మోహబూబ్ తప్పించుకోగా అతడి కారణంగా అరియానా బలి కావాల్సి వచ్చింది. అయితే అరియానా చేసిన పనికి తోటి కంటెస్టుల నుంచి ప్రశంసలు రాగా మెహబూబ్ పై మాత్రం వ్యతిరేకత వచ్చినట్లు కన్పించింది.

    వీరితోపాటు హరిక-అభిజిత్ లలో అభిజిత్ నామినేట్ అవుతున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా అవినాష్-సొహెల్ కొంతసేపు వాదించుకున్నారు. చివరికీ అవినాష్ నామినేట్ అవుతున్నట్లు చెప్పాడు. అదేవిధంగా లాస్య-దివీలు కొంతసేపు వాదించుకున్నారు. దివీకి తనపై తొలి నుంచి వ్యతిరేకత ఉన్నట్లు గ్రహించిన లాస్య ఇలాగైనా తనపై నెగిటివిని దూరం చేసుకోవాలని నామినేట్ అవుతున్నట్లు ప్రకటించింది.

    Also Read: ఓటీటీల్లో హిట్టు సినిమాలు వచ్చేసినట్టేనా?

    దీంతో ఈ వారం నామినేషన్ల ప్రక్రియ త్యాగాలు.. వాదోపవాదాలు.. గొడవలతో ఓ క్లారిటీకి వచ్చింది. కాగా ఈ వారం ఎలిమినేట్ ఉండకపోవచ్చనే బయట ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో మాత్రం కంటెస్టుల మధ్య నామినేషన్ ప్రక్రియ మరింత చిచ్చుపెట్టేలా కన్పిస్తోంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ పై బిగ్ బాస్ ఎలాంటి ట్వీస్ట్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది.