Sankranti Gift : దేశమంతా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఒక్కోచోట ఒక్కో తీరిక సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. తమిళనాడు రాష్ట్రంలో అయితే వినూత్నంగా వేడుకలు నిర్వహిస్తారు. చెరుకు గడలతో పాయసం వండుతారు. అయితే ఆ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ తండ్రి తన ఎంతో కష్టపడి సంక్రాంతి కానుక ఇచ్చాడు. అందుకోసం ఏకంగా సాహసం చేశాడు. వృద్ధాప్యంలోనూ తన కూతురి కోసం ఏకంగా 14 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
తమిళనాడు రాష్ట్రం పుదు కొట్టై ప్రాంతానికి చెందిన చెల్లాదురై వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడి కూతురు పేరు సుందర పాల్. ఈమెకు 2006లో వివాహం జరిగింది. వివాహం జరిగి 10 సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. 2016లో ఆమె గర్భం దాల్చింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచి చెల్లదురై ఆనందానికి అవధులు లేవు. అప్పటినుంచి తన కూతురి ఇంటికి ప్రతి సంక్రాంతికి చెల్లా దురై వెళ్తున్నారు. ఆమెకు, ఆమె పిల్లలకు ఏదో ఒక కానుక ఇచ్చి వస్తున్నారు. సంక్రాంతి పండుగను తమిళనాడు రాష్ట్రంలో భారీగా నిర్వహిస్తుంటారు. కొత్త పంటలు ఇంటికి రావడంతో అక్కడ చెరకు గడలతో పాయసం వండుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సంక్రాంతికి తన కూతురు, మనవరాళ్ల కోసం చెల్లాదురై సాహసం చేశారు. 70 సంవత్సరాల వయసులోనూ వెరవకుండా ఏకంగా 14 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కారు.
పుదుకొట్టై ప్రాంతంలో ఉంటున్న తన కూతురి కోసం చెరుకు గడల గుత్తిని తలపై పెట్టుకుని 14 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆమె ఇంటికి వెళ్లారు. చెరుకు గడలు ఆమెకు ఇచ్చారు. మనవరాళ్లకు కొత్త దుస్తులు కొనిచ్చారు. ఆ తర్వాత నాన్న వచ్చిన సంతోషంతో ఆ చెరకు గడలతో సుందర పాల్ మట్టికుండలో పాయసం వండింది. చెల్లా దురైకి వడ్డించింది. చెల్లా దురై తలపై చెరుకు గడలు పెట్టుకొని సైకిల్ తొక్కుతున్న వీడియోను ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో చూసిన కొంతమంది మీడియా ప్రతినిధులు చెల్లా దురైతో మాట్లాడారు. “నా కూతురికి 2006లో పెళ్లయింది. 2016 వరకు ఆమెకు సంతానం కలగలేదు. అదే సంవత్సరం చివరిలో ఆమె గర్భం దాల్చింది. కవలలకు జన్మనిచ్చింది. అప్పటినుంచి నా సంతోషానికి అవధులు లేవు. అందుకే ప్రతి సంక్రాంతి పండుగ సందర్భంగా నా కూతురు, ఆమె పిల్లల కోసం ఏదో ఒక కానుక ఇస్తూ ఉంటాను. ఎప్పటిలాగే ఈసారి కూడా చెరకుగడలు తీసుకెళ్ళాను. సైకిల్ మీద ఉత్సాహంగా 14 కిలోమీటర్ల పాటు ప్రయాణించాను. నా కూతురికి ఆ చెరకు గడలు ఇచ్చాను. ఆ క్షణంలో వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం అంతా అంతా కాదు.” అని చెల్లాదురై తన సంతోషాన్ని పంచుకున్నాడు. కాగా ఆయన మాట్లాడిన మాటలు, 14 కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
#WATCH | Pudukkottai, Tamil Nadu: An elderly man carried a bunch of sugarcane on his head and rode a bicycle for 14 kilometres to give it as a Pongal gift to his daughter. People watched him with surprise and cheered for him on his way pic.twitter.com/gvxQPGjXz1
— ANI (@ANI) January 14, 2024