Food Items – Reheat : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదనేది పెద్దల మాట. నేటి రోజుల్లో ఇది నూటికి నూరు శాతం నిజం. మారుతున్న జీవన శైలి, జంక్ ఫుడ్ ప్రభావం, రెడీమేడ్ ఫుడ్ ప్రభావంతో మన హెల్త్ దెబ్బతింటోంది. ఇక, పంటలకు ఇష్టానుసారంగా వాడుతున్న కెమికల్స్‌తో ప్రతీ ఆహారం విషతుల్యం అవుతోంది. చివరికి గేదె, ఆవు పాలు కూడా వాటికి ఇస్తున్న స్టెరాయిడ్స్ కారణంగా విషయంగా మారుతున్నాయి. స్టోరేజీకి ఉపయోగిస్తున్న కెమికల్స్‌తో మరింత విషతుల్యం అవుతున్నాయి. ఇక, నేటి ఉరుకులు పరుగుల జీవితం కారణంగా ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం, రీహీట్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నాం. అయితే కొన్ని ఆహారాలు రీహీట్ చేయడం వల్ల విషయంగా మారతాయని చాలా మందికి తెలియదు. అవేంటో తెలుసుకుందాం.
= రీహీట్ చేయడం వలన పాయిజనెస్‌గా మారే మొదటి పానీయం టీ. ఒకసారి చేసిన టీని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్, న్యూట్రిషన్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. మన ఇండియన్ టీ పాలు, చెక్కరతో చేయడం వలన అందులో బ్యాక్టీరియా త్వరగా ఫామ్ అవుతుంది. దీంతో స్టమక్ అప్‌సెట్, డయేరియా, ఇన్‌ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
= పాలకూర.. ఇందులో ఐరన్, నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రీహీట్ చేయడం వల్ల నైట్రేట్స్.. నైట్రైట్స్‌గా మారుతాయి. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుంది.
= ఇక వండిన అన్నం కూడా విషమే. దీనిని రీహీట్ చేయడం వలన దానిలోని బ్యాక్టీరియా రెట్టింపు అవుతుంది. టాక్సిన్స్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనివల్ల డయేరియా, వామిట్స్ వస్తాయి.
= మష్రూమ్స్.. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. రీహీట్ చేయడం వల్ల ప్రొటీన్ స్ట్రక్చర్ మారిపోతుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయట.
= ఆయిల్.. ఇక మనం ప్రతీ వంటకంలో ఆయిల్ వాడతాము. ప్రస్తుతం వస్తున్న రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ ఆనారోగ్యమే అని డాక్టర్లు చెబుతున్నారు. అయినా వడుతూనే ఉన్నాం. ఇక కొంత మంది ఆయిల్‌ను పదే పదే వేడిచేసి వాడతారు. కుక్కింగ్ ఆయిల్‌ను రీహీట్ చేయడం వలన ట్రాన్స్ ఫాటీస్ ఫామ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్‌ను జనరేట్ చేస్తాయి. క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.