https://oktelugu.com/

Father Threats Daughter: కన్న తండ్రే విలన్ గా మారితే..

మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాల్లో మంచితనం కనిపించడం లేదు. అనుబంధాల ఆప్యాయతలు పంచాల్సిన కన్న తండ్రి బరితెగించాడు. అక్కున చేర్చుకుని ప్రేమను పంచాల్సిన కసాయి తండ్రి తన దుష్టమైన ఆలోచన బయటపెట్టాడు. కూతురుకు అన్ని తోడై ఉండాల్సిన అతడే కూతురు శీలాన్ని పాడు చేయిస్తానని బెదిరించడంతో అతడి దుష్ట పన్నాగం తెలుస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాలయముడిగా మారి బిడ్డను అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన ఘోరమైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2021 / 06:05 PM IST
    Follow us on

    మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాల్లో మంచితనం కనిపించడం లేదు. అనుబంధాల ఆప్యాయతలు పంచాల్సిన కన్న తండ్రి బరితెగించాడు. అక్కున చేర్చుకుని ప్రేమను పంచాల్సిన కసాయి తండ్రి తన దుష్టమైన ఆలోచన బయటపెట్టాడు. కూతురుకు అన్ని తోడై ఉండాల్సిన అతడే కూతురు శీలాన్ని పాడు చేయిస్తానని బెదిరించడంతో అతడి దుష్ట పన్నాగం తెలుస్తోంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాలయముడిగా మారి బిడ్డను అభాసుపాలు చేయాలని ప్రయత్నించిన ఘోరమైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

    నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో ఎంఫిల్ విద్యార్థిని తన కన్న తల్లి, తండ్రి, సోదరితో కలిసి నివాసం ఉంటోంది. అయితే కన్న తండ్రి తన భార్య, కూతురును ఇల్లు వదిలి వెళ్లాల్సిందిగా బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం ఇంట్లోకి వచ్చిన తండ్రి తల్లి, కూతురుపై దాడికి తెగబడ్డాడు. తన తల్లి పేరిట ఉన్న ఆస్తికి సంబంధించిన అద్దెలు వసూలు చేసుకుంటూ వారిపై బరితెగిస్తున్నాడు.

    ఈ నేపథ్యంలో ఎదురు తిరిగిన కూతురు, తల్లిని నిరంతరం బూతుతు తిడుతున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోకపోతే అత్యాచారం చేయిస్తానని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నాడు. దీనిపై తల్లి, కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉదయ్ తెలిపారు. కన్న తండ్రే కాలయముడిగా మారి జుగుస్సాకరంగా వ్యవహరిస్తుండడంపై వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

    సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపాడాల్సిన వ్యక్తే తన శీలాన్ని హరింపచేస్తానని మాట్లాడడంపై పలువురు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెస్తున్న దుండగుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్ష వేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నగరం నడిబొడ్డున ఇంతటి ఘోరానికి పాల్పడాలని చూస్తున్న కసాయి తండ్రిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ చేయాలని కోరుతున్నారు.