Homeజాతీయ వార్తలుKCR- KTR: తండ్రి బీఆర్‌ఎస్‌.. తనయుడు టీఆర్‌ఎస్‌.. రాజకీయాలపై కేసీఆర్, కేటీఆర్‌ తలోమాట

KCR- KTR: తండ్రి బీఆర్‌ఎస్‌.. తనయుడు టీఆర్‌ఎస్‌.. రాజకీయాలపై కేసీఆర్, కేటీఆర్‌ తలోమాట

KCR- KTR: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మంచి మాటకారి ఎవరైనా ఉన్నారా అని అడిగితే చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు అందు చెప్పే పేరు కేసీఆర్‌. ఆయన మాటలను ఓ పదినిమిషాలపాటు విన్నామంటే.. ఒక బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. తండ్రికి తగిన కొడుకు అనిపించుకుంటున్నారు. రాష్ట్ర ఐటీ శాక మంత్రి కేటీఆర్‌. కేసీఆర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది కేటీఆర్‌ స్పీచ్‌. ఆయన మాటలను మరో పది నిమిషాలు విన్నామంటే.. మరొక అభిప్రాయం ఏర్పడుతుంది. అయితే తండ్రీ కొడుకుల మాటలో చాలా వ్యత్యాసం ఉంటుందది. ఎక్కడా మ్యాచ్‌ కావు! విన్నవాళ్లు రెండింటినీ కలగలిపి చూసుకుంటే.. కన్ఫ్యూజన్‌ తప్పదు. తాజాగా ఇద్దరూ భిన్న అభిప్రాయాలతో పార్టీ క్యాడర్‌లో, టీఆర్‌ఎస్‌ మ అభిమానులను గందరగోళంలోకి నెడుతున్నారు గులాబీ దళపతి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమైన కేటీఆర్‌!

KCR- KTR
KCR- KTR

బీజేపీ టార్గెట్‌గానే ప్రతీ ప్రెస్‌మీట్‌..
కేసీఆర్‌ ఇటీవలి కాలంలో ఎప్పుడు ప్రెస్‌ మీట్‌ పెట్టినా.. జాతీయ రాజకీయాలు, బీజేపీ టార్గెట్‌గానే ఉంటుంంది. కేంద్రంలో బీజేపీని ఎలా పడగొట్టాలి అనే విషయాలపైనే మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని పిలుపు ఇస్తున్నారు. అక్కడితో ఆగకుండా జాతీయ రాజకీయాల గురించి విలేకరులు అడిగితే.. ఎదురు ప్రశ్నలతో కొత్త ఊహలను పుట్టిస్తారు.

– ‘ప్రధాని పదవి ఆశిస్తున్నారా?’ అని అడిగితే.. ‘తెలంగాణకు ఒక మంచిపాలన అందించాం, గాడిలో పెట్టాం…. దేశాన్ని గాడిలో పెట్టొద్దా’ అని ఎదురడుగుతారు?

– ‘జాతీయ పార్టీ పెడతారా?’ అంటే.. ‘పెట్టొద్దంటావా?’ అంటారు.

– కేంద్రం అవినీతిని త్వరలో ఆధారాలతో బయటపెడతతా అంటారు. ఏమైందని అడిగితే తొందరెందుకు అని ప్రశ్నిస్తాతరు.

– జీడీడీ తగ్గుదల గురించి అడిగితే.. ఇవన్నీ నా లెక్కలు కాదు.. ఆన్‌ రికార్డు.. మీరే చూసుకోండి అని చెబుతారు.

– జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్న కేసీఆర్‌ వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతారని, ఎంపీగా బరిలోకి దిగి.. మోడీకి చెమటలు పట్టిస్తారని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ అవుతుందని లీకులు కూడా ఇచ్చారు.

హ్యాట్రిక్‌పై కేటీఆర్‌ ఆసక్తి..
కేసీఆర్‌ కొడుకు కేటీఆర్‌ మాటలను గమనిస్తే.. బీఆర్‌ఎస్‌కు భిన్నంగా ఉన్నాయి. కేసీఆర్‌.. ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారంటూ ఢంకా బజాయించి చెప్పేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే.. ఈ మాటలు.. తాము మళ్లీ గెలవబోతున్నాం అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా మాత్రమే కనిపించేవి. కానీ.. కేసీఆర్‌ కొన్నాళ్లుగా ఏర్పాటుచేసిన వాతావరణంలో ఈ మాటలు.. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల మీద ఆశ వదలుకున్నారా? దానికి సంబంధించి కేటీఆర్‌ ద్వారా లీకులు ఇప్పిస్తున్నారా? అనే అనుమానం కూడా కలుగుతుంది.

KCR- KTR
KCR- KTR

అప్రకటిత సీఎంగా కేటీఆర్‌..
తెలంగాణ సీఎం కుర్చీకి అప్రకటిత వారసుడిగా కేటీఆర్‌ అధికారం చెలాయిస్తూనే ఉన్నారు. ప్రతి వ్యవహారం ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. ‘సీఎంగా కేసీఆర్‌ హ్యాట్రిక్‌’ అనే మాట చెప్పకుండా.. కేటీఆర్‌ మౌనం పాటించి ఉంటే ఇంకో రకంగా ఉండేది. అలా అనడం వల్లనే.. సీఎం పీఠం కేటీఆర్‌కు ఇప్పట్లో దక్కబోవడం లేదా అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి సస్పెన్స్‌ తేల్చకుండా.. తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో కేసీఆర్‌ దిట్ట. ఈ దఫా కూడా ఆయన అలాగే వ్యవహరించవచ్చు. ఎన్నికలు వస్తే.. కేసీఆర్‌ ఫోకస్‌ తెలంగాణపైనా? హస్తినపైనా? క్లారిటీ వచ్చేస్తుందనే అభిప్రాయం మనకు ఉండొచ్చు గానీ.. కేసీఆర్‌ అటు ఎమ్మెల్యేగానూ, ఎంపీగానూ కూడా పోటీచేసి.. ఫలితాల తర్వాత.. పార్టీల బలాబలాలను బట్టి.. ఎటువైపు మొగ్గాలో తేల్చుకునేలా.. ఇదే సస్పెన్స్‌ కొనసాగించినా ఆశ్చర్యం లేదు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version