
రాష్ట్ర బడ్జెట్ ను వ్యవసాయ రుణాలు దాటిపోయాయని.. రైతులకు అసలు రుణాలు ఎలా ఇస్తారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకిచ్చే అప్పుల లక్ష్యం రూ.2,83,000 కోట్లు అయ్యాయని.. ఇది ఏపీ రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఇన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తారా? అని ప్రశ్నించారు.
రైతులకు లక్షల కోట్ల రూపాయల ఋణాలు ఇచ్చే మీరు కనీస మద్దతు ధరను చెల్లించలేరా? అని సీఎం జగన్ ను సోము వీర్రాజు ప్రశ్నించారు. ఉన్న మద్దతు ధరనే చెల్లించలేని మీరు, కేంద్రాన్ని కనీస మద్దతు ధర ఇంకొంచెం పెంచమని అడిగే హక్కుందా? అని నిలదీశారు.
48 లక్షల టన్నుల ధాన్యం కొంటామన్న జగన్ సర్కార్ .. 28 లక్షల కోట్లు మాత్రమే కొని రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా జగన్ సర్కార్ మోసం చేస్తోందని సోము వీర్రాజు కడిగేశారు.
మద్దతు ధరను పెంచాలని నిలదీస్తున్న జగన్.. ముందు రైతుల పూర్తి ధాన్యం ఎందుకు కొనకుండా వారిని రోడ్డున పాలు చేస్తోందని సోము వీర్రాజు విమర్శించారు. రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి మొత్తం ధాన్యం కొనాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
సోము వీర్రాజు మాట్లాడిన పూర్తి వీడియోను కింద చూడొచ్చు..
https://fb.watch/68wNqbHTqF/
https://www.facebook.com/somuveerrajubjp/videos/302414211426683