https://oktelugu.com/

రైతు సాయానికి ఫిదా అయిన మాజీ ఎంపీ కవిత

అతనో సామాన్య రైతు.. అయితేనేం.. దేశంలో వచ్చిన కరోనా లాంటి విపత్కర పరిస్థితిని చలించిపోయాడు. తన దగ్గరున్న మొత్తం డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసిన గొప్ప మనస్సు చాటుకున్నాడు. దేశాన్ని కాపాడేందుకు రైతన్న ఎల్లప్పుడు ముందే ఉంటాడని ఆ రైతు నిరూపించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల అతనో ‘రియల్ హీరో… చాలా ఇన్‌స్పైరింగ్’ అంటూ తన ట్వీటర్లో ట్వీట్ చేసి అభినందించారు. దీంతో ఆ రైతు గురించి తెలుసుకునేందుకు నెజిజన్లు […]

Written By: , Updated On : March 26, 2020 / 07:04 PM IST
Follow us on

అతనో సామాన్య రైతు.. అయితేనేం.. దేశంలో వచ్చిన కరోనా లాంటి విపత్కర పరిస్థితిని చలించిపోయాడు. తన దగ్గరున్న మొత్తం డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసిన గొప్ప మనస్సు చాటుకున్నాడు. దేశాన్ని కాపాడేందుకు రైతన్న ఎల్లప్పుడు ముందే ఉంటాడని ఆ రైతు నిరూపించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ కల్వకుంట్ల అతనో ‘రియల్ హీరో… చాలా ఇన్‌స్పైరింగ్’ అంటూ తన ట్వీటర్లో ట్వీట్ చేసి అభినందించారు. దీంతో ఆ రైతు గురించి తెలుసుకునేందుకు నెజిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లా లాండసాంగి గ్రామానికి చెందిన మోర హన్మాండ్లుకు కేవలం నాలుగెకరాల భూమి ఉంది. కొన్ని రోజులుగా కరోనా వైరస్ గురించి వార్తలను వింటున్నట్లు హన్మండ్లు చెప్పాడు. కరోనా నివారణకు కేంద్రం లాక్డౌన్ చేసిందని చెప్పారు. ఈ ఏడాది పంటలు బాగానే పండాయని.. అయితే కరోనాతో పేదలు ఆకలితో పస్తుంటారని తెలుసుకొని తన కుమారుడు కొంత ఆర్థికసాయం చేద్దామని చెప్పినట్లు హన్మండ్లు వివరించారు. దీంతో తన దగ్గరున్న 50వేలను రూపాయలను బుధవారం తమ జిల్లా కలెక్టర్ దేవసేనను అందజేసినట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50వేల చెక్కును జమ చేయాలని కోరినట్లు తెలిపాడు.

50వేలు ఇవ్వడం వల్ల తనకు కొంత ఆర్థికంగా నష్టం జరుగచ్చు కానీ.. కాలం కలిసొస్తే మళ్లీ సంపాదించుకుంటాననీ గర్వంగా చెబుతున్నాడు. తన లాంటివాళ్లు సాయం చేయడానికి ముందుకు రావాలని హాన్మండ్లు కోరుతున్నాడు. ఇలాంటి కష్టం శత్రువులకు కూడా రావొద్దని కోరుకుంటున్నానని తెలిపాడు. ఆయన నిస్వార్థ హృదయానికి ప్రతీఒక్కరూ ఫిదా అవుతున్నారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రైతు సాయాన్ని తెలుసుకొని తన ట్వీటర్లో రైతు సాయానికి సంబంధించిన క్లిప్పింగ్ పోస్టు చేశారు. అతనో ‘రియల్ హీరో.. చాలా ఇన్‌స్పైరింగ్’ అంటూ ట్వీట్ చేయడం ప్రతీఒక్కరిని ఆకట్టుకుంది.