ప్రపంచంలోనే అత్యంత సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు చోటు దక్కింది. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా-2020లో భారతదేశం నుంచి అక్షయ్ కుమార్ ఒక్కడికే చోటుదక్కడం గమనార్హం. ఫోర్బ్స్ లిస్టులో అక్షయ్ కుమార్ 48.5మిలియన్ల డాలర్ల సంపాదనతో ఆరో స్థానంలో నిలిచారు. ఇది ఇండియన్ కరెన్సీలో 363కోట్ల రూపాయాలతో సమానం. అయితే కిందటేడాది ఫోర్బ్స్ లిస్టులో అక్షయ్ కుమార్ నాలుగో స్థానం దక్కించుకోగా ఈసారి మాత్రం ఆరోస్థానానికి పరిమితమయ్యాడు.
Also Read: సక్సెస్ లేని డైరెక్టర్ కు ఇగో ఎందుకో !
ఫోర్బ్స్-2020 జాబితాలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ 87.5 మిలియన్ డాలర్లతో తొలిస్థానం దక్కించుకున్నాడు. కిందటేడాది కూడా ఆయనే తొలిస్థానంలో నిలువడం గమనార్హం. రెండో స్థానంలో డెడ్‌పూల్ స్టార్ ర్యాన్ రెనాల్డ్ 71.5మిలియన్ల డాలర్లతో ఉన్నాడు. మార్క్ వాల్బర్గ్ మూడు, బెన్ అఫ్లెక్ నాలుగు, విన్ డీజిల్ ఐదో స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్-2020 జాబితాలో భారతీయుల నుంచి అక్షయ్ కుమార్ మినహా మరేవరికీ చోటుదక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకొని నటించే హీరోలు ఎంతమంది ఉన్నా అక్షయ్ ఒక్కడికే ఫోర్బ్స్-2020 జాబితాలో చోటు దక్కడం ఆసక్తిని రేపుతోంది. అయితే అక్షయ్ బాలీవుడ్లో వరుసబెట్టి సినిమాలు చేస్తుండటం వల్లే ఆయన ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. మిగతా హీరోలంతా ఏడాదికి ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకోవడంతో వారంతా సంపాదనలో అక్షయ్ కుమార్ కు పోటీ ఇవ్వలేకపోయారనే టాక్ విన్పిస్తుంది.
Also Read: పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !
మహారాష్ట్రలో కరోనా విజృంభణతో సినిమా షూటింగులన్నీ నిలిచిపోయాయి. దీంతో అక్షయ్ కుమార్ సైతం ఇంటికే పరిమితయ్యాడు. అయితే ఈ సమయంలో కరోనా నివారణ కోసం ప్రధాని సహాయనిధికి రూ.25కోట్ల సాయం ప్రకటించి వార్తల్లో నిలిచారు. అదేవిధంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.3కోట్ల సాయం చేశారు. ఈ విరాళంలో మున్సిపల్ కార్మికులకు అవసరమైన పీపీఈ కిట్స్ అందించారు. ఇక ప్రస్తుతం దర్శకుడు రాఘవ లారెన్స్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ మూవీని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాడు. దీంతోపాటు బెల్ బాటమ్, బచ్చన్ పాండే, పృథ్వీరాజ్ సినిమాలను అక్షయ్ లైన్లో పెట్టాడు.