Yellow Media : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంటుంది ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహారం. ఆ మీడియాకు కులాభిమానం అధికం. తమవారే పవర్ లో ఉండాలి. పవర్ ను ఎంజాయ్ చేయాలి. ఆ సామాజికవర్గమే డెవలప్ కావాలి. ఈ కాన్సెప్ట్ తోనే అవి బతికేస్తుంటాయి. అవసరమైతే ఎంతకైనా తెగిస్తాయి. ఈ క్రమంలో అదిరిస్తాయి.. బెదిరిస్తాయి. అవసరమైతే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తాయి. ముద్రణ, ప్రసార రంగంలో తనకంటూ ముద్ర వేసుకొని.. మీడియా ముసుగులో అవి దశాబ్దాలుగా సాగిస్తున్న దందా అంతా ఇంతా కాదు. ప్రజల సంక్షేమం కంటే., తమవారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముచ్చటగా ‘ఎల్లో’ మీడియాగా గుర్తించబడ్డాయి.
వర్గాలుగా మారి..
ఏపీలో మీడియా వర్గాలుగా విడిపోయింది. చాన్నాళ్లుగా ఈ తంతు సాగుతోంది. కానీ ఇటీవల మాత్రం అధికమైంది. ఎల్లో మీడియా, నీలి మీడియా, కూలి మీడియా.. ఇలా రకరకాల పేర్ల ఏపీ మీడియాను విభజించారు. అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రభుత్వాలకు అనుకూలంగా మారిపోవడం సహజం. పత్రికలు, చానళ్ల నిర్వహణకుగాను ఎప్పటికప్పుడు స్ట్రాటజీని మార్చుకుంటున్నాయి. అయితే ఎల్లో మీడియాగా పిలవబడే ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం అందుకు విరుద్ధం. వారి పుణ్యం, పురుషార్థం ఒక్కటే. టీడీపీ అధికారంలో ఉండాలి. గౌరవం దక్కాలి. దాని కోసం ఎందాకైనా వెళ్లేందుకు ఈ సెక్షన్ ఆఫ్ మీడియా సిద్ధంగా ఉంటోంది.
పరాకాష్టకు విష ప్రచారం..
ఎల్లో మీడియా విష ప్రచారం పిచ్చికి పరాకాష్టగా మారింది. నిద్దర లేస్తే ప్రభుత్వంపై విష ప్రచారం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తోంది. రాజకీయ ప్రత్యర్థిగా టీడీపీ ఉన్నా..ఈ రెండు మీడియాల వాయిస్ నే పసుపు దళం వినిపిస్తోంది. టీడీపీకి, చంద్రబాబుకు, కమ్మ సామాజికవర్గానికి ఇంపైన వార్తలతోనే కప్పేస్తుంది. వారికి మైలేజ్ ఇచ్చేవాటిని ఎంకరేజ్ చేస్తోంది. ఇబ్బందులు వస్తాయనుకున్నవాటికి పాతాళాన తొక్కేస్తుంది. దశాబ్దాలుగా మీడియా ముసుగులో జరుగుతున్న తంతు ఇదే.
ఎప్పటికప్పుడు ప్రాధాన్యతలు..
మొన్నటికి మొన్న రజినీకాంత్ చంద్రబాబు విజనరీ నాయకుడు అన్న మాటను పతాక శీర్షికన కథనం ప్రచురించాయి. అదే విజయవాడకు గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చుండ్రు వచ్చారు. సీఎం జగన్ చర్యలను మెచ్చుకున్నారు. కానీ అది కనీస వార్త కాలేదు. ఎక్కడా ప్రచురణకు నోచుకోలేదు. అంతెందుకు టీడీపీతో జనసేన పొత్తు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పవన్ విషయంలో అచీతూచీ వ్యవహరిస్తోంది. చంద్రబాబుకు అవసరమనిపిస్తే పవన్ ను పెద్ద మనిషిలా మార్చేస్తుంది. అదే అవసం లేకుంటే మాత్రం మరీ చిన్నబోయేలా చూపిస్తుంది. అయితే తమ వాదమే ప్రజావాదమన్న భ్రమలో కనిపిస్తోంది. కాలం మారింది. మీడియా విస్తృతమైంది. కానీ అవేవీ పట్టని ఎల్లో మీడియా మాత్రం తమకు అలవాటైన విద్యను కొనసాగిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: False propaganda by yellow media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com