చైనావోడి బరితెగింపు..  భారత్ ఆక్రమించిందంట.. అసలు కథేంటి?

లద్దాఖ్  కేంద్ర పాలిత ప్రాంతాన్ని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిందని చైనా ఆరోపించింది. వాటిని ఎట్టి పరిస్థితిలోనూ గుర్తించేది లేదని చెప్పింది.. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మంగళవారం తెలిపారు. భారత రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సోమవారం  బార్డర్లో 44కీలకమైన బ్రిడ్జిలను ప్రారంభించిన నేపథ్యంలో  ఈ ప్రకటన వచ్చింది. Also Read: టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే: బిహార్ లో గెలుపు ఎవరిదంటే? చైనా ప్రతినిధి […]

Written By: NARESH, Updated On : October 14, 2020 1:31 pm
Follow us on

లద్దాఖ్  కేంద్ర పాలిత ప్రాంతాన్ని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిందని చైనా ఆరోపించింది. వాటిని ఎట్టి పరిస్థితిలోనూ గుర్తించేది లేదని చెప్పింది.. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ మంగళవారం తెలిపారు. భారత రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సోమవారం  బార్డర్లో 44కీలకమైన బ్రిడ్జిలను ప్రారంభించిన నేపథ్యంలో  ఈ ప్రకటన వచ్చింది.

Also Read: టైమ్స్ నౌ-సీఓటర్ సర్వే: బిహార్ లో గెలుపు ఎవరిదంటే?

చైనా ప్రతినిధి  లిజియాన్ ఇంకా మాట్లాడుతూ.. సరిహద్దు ప్రాంతంలో భారత్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు బలగాల మోహరింపుతోనే ఇరు దేశాల మధ్య  ఉద్రిక్తతలు తలెత్తడానికి ప్రధాన  కారణమని ఆరోపించారు.

అయితే ఈ విషయం ఇలా ఉంటే.. భారత్, చైనా మధ్య ఏడో విడత సైనిక చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా జరిగాయని ఒక ఉమ్మడి ప్రకటన వెలువడింది. రెండు దేశాల మధ్య  నెలకొన్ని విభేదాలు.. వివాదాలుగా మారకుండా చూడాలని  నిర్ణయించినట్లు తెలిపారు. భారీగా మోహరించిన బలగాలను వెనక్కి పిలిచే అంశంపై  సోమవారం చుషుల్ ప్రాంతంలో ఇరు దేశాల సైనిక కోర్ కమాండర్లు  సమావేశమయ్యారు. 12గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణపై  ఎలాంటి నిర్ణయం రాలేదు..

Also Read: ట్రంప్‌కు టెన్షన్: ‘ముందస్తు ఓటింగ్‌’లో బైడెన్‌ ముందంజ..?

అయితే లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఏసీ)  వద్ద ఏప్రిల్ నాటి పరిస్థితి తేవాలని భారత్ గట్టిగా పట్టుపట్టింది. బలగాల ఉపసంహరణ ఒక్క ప్రాంతంలోనే కాకుండా అన్ని చోట్ల చేయాలని చెప్పింది. భారత్కు బాగా పట్టున్న  పాంగాంగ్ దక్షిణ రేవు నుంచే బలగాల ఉపసంహరణ చేయాలని చైనా డిమాండ్ చేయగా భారత్ ససేమిరా ఒప్పుకోలేదు.  కాగా, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం దొరికినట్టయితే..  సాధ్యమైనంత త్వరగా బలగాలను  ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి.