Sankranti Holidays : ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సెలవుల పొడగింపుపై కీలక నిర్ణయం

శుక్ర, శని వారాలను సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.

Written By: Raj Shekar, Updated On : January 17, 2024 10:22 pm
Follow us on

Sankranti Holidays : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్రాంతి సెలవును పొడగించింది. మరో మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ప్రకటించిన సెలవుల ప్రకారం.. జనవరి 18న పాఠశాలలు తెరుచుకోవాలి. కానీ ఈసారి సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహిస్తుండడంతో చాలా మంది విద్యార్థులు సొంత ఊళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సెలవులను పొడగిస్తూ విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వరుసగా 13 రోజులు..
తాజాగా ఏపీ ప్రభుత్వం సెలవులు పొడగించడంతో ఈసారి ప్రభుత్వ పాఠశాలకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. తెలంగాణలో పాఠశాలలకు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఆరు రోజులు సెలవులు వచ్చాయి. జూనియర్‌ కాలేజీలకు కూడా మొత్తం నాలుగు రోజులు సెలవులను ప్రకటించారు. 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. గురువారం(జనవరి 18న) పాఠశాలలు తెచుకోనున్నాయి. ఇక ఏపీలో ఇంటర్‌ కాలేజీల సెలవులు ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సంక్రాంతి సెలవులు పది రోజులు. జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.

సెలవులు పొడగింపు..
గురువారంతో విద్యా సంస్థల సెలవులు ముగియనున్నాయి. కానీ సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లిన విద్యార్థులు అమ్మ బుధవారం వరకు ఇంకా ఊళ్లలోనే ఉండిపోయారు. బస్సుల కొరత, పండుగ సంబురం నేపథ్యంలో చదువుకుంటున్న పట్టణాలకు, హాస్టళ్లకు బుధవారం సాయంత్రం వరకు చేరుకోలేదు. గురువారం బయల్దేరినా సాయంత్రానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శుక్ర, శని వారాలను సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.