డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో దోపిడీ

ప్రజల్లో ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తుంటారు. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ప్రజల ఆశలను ఆయుధాలుగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి గురించి ఎన్నో వింటున్నాం. మళ్లీ మోసపోతున్నాం. ఎవడో ఏదో చెబితే నమ్మేయడం చివరికి మోసపోయామని బాధపడడం అలవాటైంది. మోసాన్ని మొదటే గుర్తించి నిలదీస్తే ఈ బాధలు ఉండవు. అందినకాడికి దోచుకుని చేతులెత్తేయం కొత్తేమీ కాదు. ఇదివరకు జరిగిన సంఘటనలే. అయినా కొత్త తరహాలో మోసపోవడం. ఇంకెన్నాళ్లు […]

Written By: Srinivas, Updated On : June 15, 2021 9:36 am
Follow us on

ప్రజల్లో ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేస్తుంటారు. మోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. ప్రజల ఆశలను ఆయుధాలుగా చేసుకుని మోసాలకు పాల్పడే వారి గురించి ఎన్నో వింటున్నాం. మళ్లీ మోసపోతున్నాం. ఎవడో ఏదో చెబితే నమ్మేయడం చివరికి మోసపోయామని బాధపడడం అలవాటైంది. మోసాన్ని మొదటే గుర్తించి నిలదీస్తే ఈ బాధలు ఉండవు. అందినకాడికి దోచుకుని చేతులెత్తేయం కొత్తేమీ కాదు. ఇదివరకు జరిగిన సంఘటనలే. అయినా కొత్త తరహాలో మోసపోవడం. ఇంకెన్నాళ్లు ఈ అమాయకత్వం. ఎన్నేళ్లు మోసాలకు గురికావడం. వీటికి అడ్డుకట్ట లేదా?

హైదరాబాద్ వేదికగా ఓ ముఠా దోపిడీకి పాల్పడింది. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లనే ఆయుధంగా చేసుకుని బురిడీ కొట్టించింది. ఈ పథకంలో ఇళ్లు ఇప్పిస్తామని ఆర్సీ పురంలో ఓ ముఠా రూ. కోట్లు వసూలు చేసింది. సెక్రటేరియట్ లో పరిచయాలున్నాయి. తాము ఎంత చెబితే అంతే అని నమ్మించి అమాయకుల నుంచి రూ. లక్షలు వసూలు చేసింది. దీంతో అమాయకులు ఇళ్లు వస్తాయనే ఆశతో ఉన్నదంతా దోచిపెట్టారు.

ఈ ముఠా హంగూ, ఆర్భాటాలు చూసి రూ. లక్షల్లో ముట్టజెప్పారు. అలా వచ్చిన డబ్బుతో వారు ఏకంగా 50 కార్లు కొనుగోలు చేశారు. అంటే వారు ఏ రేంజ్ లో వసూలు చేశారో అర్థం అవుతోంది. ఇళ్లు ఇప్పిస్తామంటూ రోజులు,నెలలు వాయిదా వేస్తుండడంతో డబ్బులు కట్టిన ఓ బాధితుడికి అనుమానం వచ్చి ఆరా తీయగా విషయం తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి 50 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ పథకాల విషయంలో మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి తరువాత మోసపోయామని గుర్తిస్తే ఏం లాభం. ముందే జాగ్రత్తగా వ్యవహరించి ఎవరైనా నిలదీయాలి. అసలు విషయం తెలుసుకోవాలి. వారి అర్హతలేంటని ఆరా తీయాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. అర్హులైన వారు నేరుగా దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తే మీకు ఆధారం ఉంటుంది. ఇలా నకిలీ మఠాలను నమ్మి మోసపోయి డబ్బు వృథా చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.