ఏపీలో కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. కరోనా తీవ్రతతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేని పరిస్థితి. బెడ్స్ కోసం 2లక్షలు పోసినా ఇవ్వని దుర్భర స్థితి. ఇక కరోనా టెస్టుల పేరుతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో కరోనా పేరిట జరుగుతున్న దోపిడీకి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ప్రైవేటు డయాగ్నోస్టిక్స్ సెంటర్ల ధరలకు కళ్లెం వేసింది.
ఏపీలో ఇక కోవిడ్ పరీక్షలు నిర్వహణకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్ కు రూ.3000 రూపాయలు ధరను నిర్ధారిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో కోవిడ్ అనుమానితుల పరీక్షలకు 3000 రూపాయలు వరకు ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో 3000 రూపాయలకు మించి వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు. 3000రూపాయలకు మించి ఎక్కువ డిమాండ్ చేస్తూ కరోనా అనుమానితుల నుండి వసూలు చేస్తే 1902కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
అధికంగా సిటీ స్కానింగ్ సెంటర్ లలో ప్రజలు నుండి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కరోనా అనుమానితులు సిటీ స్కానింగ్ సెంటర్ లో పరీక్షలు నిమిత్తం ప్రభుత్వం నిర్ధేశించిన 3000 రూపాయలు ధరను మాత్రమే చెల్లించాలని.. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. సిటీ స్కానింగ్ సెంటర్ లో కరోనా పరీక్ష కోసం 3 వేలుకు మించి వసూలు చేసినట్టు ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే స్కానింగ్ సెంటర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
ప్రతి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లో ప్రభుత్వం నిర్ధారణ చేసిన 3వేలు రూపాయలు ధరను తెలిపే విధంగా అందరికీ కనిపించడం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరోనా స్కానింగ్ రిపోర్ట్ కు సంబంధించిన బిల్లు వెంటనే కోవిడ్ అనుమానితులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సిటీ స్కానింగ్ సెంటర్స్ లో కరోనా నిర్ధారణ అయితే వారికి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్ కూడా సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత హాస్పిటల్స్ లో బెడ్స్ లేవు అంటే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యత వహించాలని ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి హెచ్చరించారు.
ప్రతి సిటీ స్కానింగ్ సెంటర్ లో కరోనా పరీక్షలు చేయించుకునే వారి వివరాలు మొబైల్ నంబర్స్ తో సహా పూర్తి సమాచారాన్ని అప్ లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. సిటీ స్కానింగ్ రిపోర్ట్ పై సంబంధించిన స్కానింగ్ సెంటర్ మెడికల్ టెక్నీకల్ ఇంచార్జి తప్పనిసరిగా సంతకం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్స్ లో కోవిడ్ అనుమానితుల పూర్తి సమాచారాన్ని అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. స్కానింగ్ కోసం వస్తున్న వారినుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఎక్కువ వసూలు చేస్తే 1902కి ఫిర్యాదు చేయాలని.. తక్షణమే చర్యలు ఉంటాయని ఏపీప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.