
మనదేశంలో ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేవని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా అన్నారు. కోవిడ్ -19 రెండో వేవ్ విజృంభించడంతో 40కి పైగా దేశాలు మనకు సాయపడేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. గతంలో ఈ దేశాలకు మనం సాయపడ్డామని ఇప్పుడు అవి తిరిగి మనకు సహాయపడుతున్నాయని అన్నారు. ఇది మునుపెన్నడూ లేని పరిస్థితి. ప్రాధాన్యతలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు.