ఎక్స్ క్లూజివ్ : ESI స్కామ్ లో అరెస్టులు జరిపిన వారే A1?

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ పార్టీ నేత అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేపో మాపో అతనిని జైలుకు పంపిస్తాం అన్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు హుటాహుటిన అతని ఆరోగ్యం బాగోలేకపోయినా…. తన సొంత నివాసం నుండి నానా హంగామా చేసి అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది కానీ ఇప్పటివరకు అచ్చెన్నాయుడి పై చార్జిషీట్ లేదు అని టీడీపీ అనుకూల మీడియా […]

Written By: Navya, Updated On : August 20, 2020 2:00 pm
Follow us on

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ పార్టీ నేత అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మెడికల్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేపో మాపో అతనిని జైలుకు పంపిస్తాం అన్నట్లు ఏసీబీ ఉన్నతాధికారులు హుటాహుటిన అతని ఆరోగ్యం బాగోలేకపోయినా…. తన సొంత నివాసం నుండి నానా హంగామా చేసి అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జరిగి దాదాపు రెండు నెలలు పూర్తి అయిపోయింది కానీ ఇప్పటివరకు అచ్చెన్నాయుడి పై చార్జిషీట్ లేదు అని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది.

ఏదైనా స్కామ్ జరిగినప్పుడు అక్కడ అవినీతి సొమ్ము అనేది ఉండాలి. అది కాస్తా తవ్వేకొద్ది బయటపడుతుంది. రెండు నెలల నుండి ఏసీబీ వారు ఎన్నోసార్లు అచ్చెన్నాయుడు ని అతనితోపాటు అరెస్టయిన 12 మందిని విచారించారు. అయితే ఒక్క రూపాయి కూడా బయటపడలేదు. దీంతో “ఈ కేసులో అసలు సీరియస్ నెస్ ఎంత?” అనే ప్రశ్న ప్రజల మదిలోకి వచ్చేసింది. అచ్చెన్నాయుడు ఒత్తిడితోనే అధికారులు స్కామ్ కు తెరలేపారు అన్నది ఏసీబీ ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి గతంలోనే అచ్చెన్నాయుడు రాశాడు అని చెప్పిన కొన్ని లేఖలు బయటకు వచ్చాయి. అయితే అచ్చెన్నాయుడుకి మాత్రం రూపాయి కూడా రాలేదు అన్నదీ ఏసీబీ అధికారులే చెబుతున్నారు. అధికార దుర్వినియోగం కింద ఇన్ని రోజుల లోపల ఉన్న అచ్చెన్నాయుడు అలాంటి వ్యక్తికి బయటనుండి బెయిలు రాకపోవడం ఏమిటి?

ఇక అచ్చెన్నాయుడు చూస్తే తాను స్వతహాగా ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదని.. ప్రభుత్వం నిర్ణయాల ప్రకారమే నడుచుకున్నాను అన్నట్లు చెబుతున్నాడు. అంతే… వైసీపీ సోషల్ మీడియా దీనిని ఆధారంగా చేసుకొని టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీని వెనకాల ఉన్నాడని… ఈ కేసులో A1 అతనే అని అంటున్నారు. అలాంటప్పుడు ఏసీబీ అధికారులు ఇన్నిసార్లు తీగలాగితే డొంక కదలకపోవడం వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు ఏసీబీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే.. ‘ఇన్ని నెలలు విచారణలో ఒక్క రూపాయి బయటపడకుండా…. ఒకరి పేరు కూడా బయటకు రాకుండా కాలం ఎలా గడుపుతున్నారు…?’ అన్నది ప్రశ్న.

ప్రభుత్వం ఒత్తిడి మీద ఏసీబీ అధికారులు వ్యవహరించినట్లు అయితే అసలు వారు చెబుతున్న ఈ స్కామ్ లో ఎలాంటి బలమైన ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు అరెస్టు జరిపినందుకు వారే A1 ముద్దాయిలుగా గుర్తింపపబడతారు. “అంతటి వరకు ఎవరూ తెచ్చుకోరు” అన్నది ప్రజల నమ్మకం. మరి అవినీతి నిరోధక శాఖ అధికారులే అచ్చెన్నాయుడు అరెస్ట్ పై…. అతనికి సంబంధించిన అవినీతి సొమ్ము పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం…. మీడియా ముందు తడబడటం వంటివి చూస్తుంటే ఎవరైనా ఏమనుకోవాలి?

Also Read : చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

నిన్నమొన్నటిదాకా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అరెస్టు విషయంలో కూడా అధికార పార్టీ నేతలు…. అతను ఖచ్చితంగా జైలు ఊచలు లెక్కపెడతారని సెలవిచ్చారు. ఏసీబీ మాత్రం ఈ కేసుతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతోంది. అంటే… ప్రభుత్వం, ఏసీబీ మధ్య సమాచార లోపం జరిగిందా…? ఇదంతా చూస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏదో హడావిడి కోసం టిడిపి నేతలను అరెస్ట్ చేయించి, తద్వారా ఆ భయం మిగిలిన వారిలో కూడా నింపేందుకు, నాయుడు నోరుని కంట్రోల్ చేసేందుకు ఇదంతా చేస్తున్నట్లు ఉందే తప్ప…. దీని వెనుక అసలు సరైన కారణాలు లేవంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు…?

Also Read : అదృష్టం కొద్దీ బెయిల్ వచ్చింది..! మరి బుద్ధి….?