https://oktelugu.com/

నిర్మాత లాభం కోసం.. ప్రభాస్ రిస్క్ !

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే పెళ్లిని కూడా పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్న ప్రభాస్.. అంతే స్పీడ్ తో సినిమాలను కూడా పూర్తి చేయాలని కరోనాను కూడా లెక్క చేయకుండా అక్టోబర్ 12 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చేసాడు. నిజానికి కరోనా దెబ్బకు భయపడి […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2020 / 01:18 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే పెళ్లిని కూడా పోస్ట్ ఫోన్ చేసుకుంటూ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్న ప్రభాస్.. అంతే స్పీడ్ తో సినిమాలను కూడా పూర్తి చేయాలని కరోనాను కూడా లెక్క చేయకుండా అక్టోబర్ 12 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూట్ చేయడానికి డేట్స్ కూడా ఇచ్చేసాడు. నిజానికి కరోనా దెబ్బకు భయపడి షూటింగ్ లకు సినిమా వాళ్ళు బ్రేక్ ఇచ్చి ఇప్పటికే నాలుగు నెలలు పూర్తి అవుతున్నా.. మన స్టార్ హీరోలు షూట్ చేద్దామంటూ ఎవ్వరూ ముందుకు రావట్లేదు. షూటింగ్ కోసం ప్రస్తుతం ప్రభాస్ మాత్రమే సన్నద్ధం అవుతున్నాడు.

    Also Read: శ్రీరాముడు ప్రభాస్‌, సీత కీర్తి సురేషేనా..!

    అయితే ప్రభాస్ ఇంత త్వరగా షూట్ చేయడానికి కారణం, నిర్మాత నష్ట పోకూడదు అనే. లాక్ డౌన్ కి ముందు ‘రాధే శ్యామ్’ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 6 కోట్ల రూపాయిలు పెట్టి ఓ భారీ హాస్పిటల్ సెట్‌ వేశారట. సెట్ కావడంతో అది ఐదు నెలలకు మించి ఎక్కువ కాలం ఉండదని.. ఇప్పటికే సెట్ వేసి నాలుగు నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో.. అక్కడ సాధ్యమైనంత త్వరగా షూట్ చేయకపోతే సెట్ పోతుంది, నిర్మాతలకు ఆరు కోట్లు నష్టం వస్తోందనే ఉద్దేశ్యంతోనే.. ప్రభాస్ షూట్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఏమైనా నిర్మాత కోసం ప్రభాస్ రిస్క్ చేయడానికి కూడా సిద్ధం కావడం అతని మంచి మనసుకి నిదర్శనం.

    Also Read: అయ్యో.. పాపం బాలయ్య.. !

    కాగా అక్టోబర్ 12 నుండి మొదలుకానున్న ఈ షెడ్యూల్ లో దాదాపు పది రోజుల పాటు ప్రభాస్ తో పాటు ఇతర ఆర్టిస్ట్ ల పై కూడా కీలక సన్నివేశాల షూట్ జరగనుంది. ఆ తరువాత ఈ హాస్పిటల్ సెట్‌ లోనే క్లైమాక్స్ లో ప్రభాస్ పై వచ్చే కొన్ని కీలక యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తారని.. ఈ సీన్స్ సినిమాలోనే హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఏ మాత్రం హిట్ అండ్ ఫేమ్ కూడా లేని రాధాకృష్ణ కుమార్ అనే ‘జిల్’ మూవీ డైరెక్టర్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇప్పుడు ఇది మరొక పెద్ద సమస్యగా మారింది. ఈ సినిమాని నాలుగు భాషల్లో మార్కెట్ చేయాలంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ముఖ్యం. అందుకే ఈ సినిమాకి బిజినెస్ విషయంలో నిర్మాతలకు కాస్త ఇబ్బందే. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నాయి.