Amit Shah: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రకటించారు. దీంతో ముందస్తుపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. కేసీఆర్ ఓటమి భయంతో ఉన్నారని తెలుస్తోంది. దీంతో వ్యతిరేకత మరింత పెరగకుండా చూసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే హుజురాబాద్ ఓటమి తరువాత పార్టీని కాపాడుకునే క్రమంలో ముందస్తు మంత్రం వేస్తున్నట్లు సమాచారం.

దీనిపై పలుమార్లు కేంద్రంతో చర్చలు జరిపినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ధ్రువీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ప్లాన్ ను అందరు తెలుసుకున్నారు. అయితే గతంలో కేంద్రంతో ఉన్న సంబంధాలతో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సమయం కలిసొచ్చేలా ప్రణాళిక వేసుకుని సక్సెస్ అయ్యారు. కానీ ఈ సారి కేంద్రంతో వివాదాలు చోటుచేసుకోవడంతో కేంద్రం కేసీఆర్ కు అనుకూలంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటుందని చెబుుతున్నారు.
వచ్చే ఏడాది ఆగస్టులో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పచ్చజెండా ఊపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలన్ని వీలైనంత వరకు పూర్తి చేసుకోవాలని ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో దళితబంధు పథకం వేగవంతం చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ వ్యూహాలను తెలుసుకున్న కేంద్రం అందుకు అనుగుణంగా నడుచుకునేందుకు సిద్ధంగా లేకపోవడంతో కేసీఆర్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
Also Read: Politicians: రాజకీయ నేతలకూ ఫ్యాన్స్ ఉన్నారుగా?
హుజురాబాద్ లో వ్యతిరేక ఫలితాలు రావడంతో కేసీఆర్ పునరాలోచనలో పడిపోయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ర్టంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోలు అంశాన్ని తెరమీదకు తెచ్చి కేంద్రంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ స్కెట్ లో ముందస్తు ఎన్నికలు ప్రధాన భూమిక పోషించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Real Estate In Telangana: తెలంగాణ భూమి బంగారం.. వ్యాపారుల కష్టానికి దక్కిన గౌరవం