KCR: టీడీపీలో ఉండి ఇదే కేసీఆర్ ను మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. బండ బూతులు కురిపించాడు. అందుకే కేసీఆర్ ఇన్నాళ్లు మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరుతానన్న చేర్చుకోలేదు. కానీ ఒకప్పటి టీడీపీ సహచరుడు కావడంతో మనసు మార్చుకొని తాజాగా గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని పార్టీలో కలిపేశారు. అయితే పాత పగలన్నీ మనసులో ఉన్నాయో ఏమో కానీ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.
kcr mothkupalli
‘స్వరాష్ట్ర ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నన్ను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదు. స్వరాష్ట్ర మద్దతు కోసం ఒక్క యూపీ మాజీ సీఎం మాయవతినే 19 సార్లు కలిశాను’ అంటూ మోత్కుపల్లికి కౌంటర్ ఇచ్చాడో లేక పాత తిట్లు గుర్తు చేశాడో కానీ కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు.
ఇక గులాబీ పార్టీలో చేరిన మోత్కుపల్లితో అనుబంధాన్ని తలుచుకొని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరం ఏళ్లుగా కలిసి పనిచేశామని.. విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన మోత్కుపల్లికి తెలంగాణ విద్యుత్ కోసం ఎంత ఇబ్బందులు పడిందో తెలుసన్నారు. ఇక మోత్కుపల్లి వైద్యానికి రూ. కోటి ఖర్చయినా పెడుతానంటూ అభయం ఇచ్చాడు. రాజకీయాలకు అతీతం మోత్కుపల్లితో స్నేహం అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు.
ఇక తెలంగాణ పథకాలు కళ్యాణ లక్ష్మీ, దళితబంధును కేసీఆర్ ప్రస్తావించారు. భవిష్యత్తులో దళితబంధును ప్రజలందరికీ పంచే యోచనలో ఉన్నట్టు తెలిపాడు. దీనికి ప్రణాళికలు చెప్పాడు. ఏడేళ్లలో మొత్తం 23లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని.. అందులో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదన్నారు. దాంతో రూ.10లక్షల కోట్లు సంపాదించవచ్చని.. ఇది భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచిగా నిలిచే పథకమన్నారు.
మొత్తంగా అటు మోత్కుపల్లిని కూల్ చేయడంతో పాటు ఇటు తెలంగాణ ప్రజలకు భవిష్యత్తులో దళితబంధును అమలు చేసేందుకు కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.