Three Movies: సినిమా నిర్మాత మహేష్ కోనేరు మరణం పై ప్రస్తుతం అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ కోనేరుకి దాదాపు 70 కోట్ల అప్పులు ఉన్నాయని కొందరు, లేదు.. అనారోగ్య సమస్య కారణంగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని మరికొందరు ఇలా ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు.

ఎవరు ఎన్ని మాట్లాడిన ఒక యువ నిర్మాతను టాలీవుడ్ కోల్పోయింది. పాత్రికేయుడిగా జీవితాన్ని మొదలుపెట్టి.. పీఆర్వోగా ఎదిగి నిర్మాతగా అభివృద్ధి చెందిన ఒక సక్సెస్ ఫుల్ పర్సన్ మరణం వెనుక ఇలాంటి పుకార్లు రావడం బాధాకరమైన విషయమే. అయితే, మహేష్ కోనేరు ఇటీవలే నిర్మాణ రంగంలో తన వేగాన్ని పెంచారు. ఏడాదికి మూడు సినిమాల చొప్పున చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే మహేష్ కోనేరు చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అల్లరి నరేష్ తో ‘సభకు నమస్కారం’ ఒక సినిమా, అలాగే నాగశౌర్యతో ‘పోలీసు వారి హెచ్చరిక’ మరో సినిమా.. ఇక హీరో సందీప్ కిషన్ తో మరో సినిమా.. మొత్తంగా మూడు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు మహేష్ కోనేరు లేరు. మరి ఆ సినిమాల పరిస్థితి ఏమిటి ?
70 కోట్ల అప్పులు అనే పుకార్లు వచ్చినప్పటి నుంచి మహేష్ కోనేరు సన్నిహితులు కూడా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. దాంతో ఈ మూడు సినిమాల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సభకు నమస్కారం సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. ఇప్పటికే అందరికీ అడ్వాన్స్ లు ఇచ్చారు. అలాగే పోలీసు వారి హెచ్చరిక కూడా ప్రీ ప్రొడక్షన్ లో ఉంది.
పోలీసు వారి హెచ్చరిక సినిమాకి సంబంధించిన టీం మొత్తానికి అడ్వాన్స్ లు ఇచ్చారు. అలాగే సందీప్ కిషన్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే సగం సినిమా పూర్తి అయిపోయింది. మరి ఈ మూడు సినిమాలను ఎవరు టేకప్ చేస్తారు ? ఇప్పటికైతే ఎవరు ముందుకు రావడం లేదు. మరోపక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు తెలియదు అని చేతులు ఎత్తేస్తున్నారు.
ఇప్పుడు ఈ సినిమాల కోసం చాలామంది కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే.. మహేష్ కోనేరుకి ఇండ్రస్ట్రీలో చాలా అప్పులున్నాయని టాక్ నడుస్తోంది. ఒకవేళ సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేసే సమయంలో అప్పులవాళ్లంతా ఎగబడతారు. అందుకే ఈ మూడు సినిమాలు ప్రస్తుతం అనాథులుగా మిగిలిపోయాయి.