YS Sharmila: రాజన్న రాజ్యమే లక్ష్యంగా తెలంగాణలో వైఎస్సార్ టీపీ అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. తన తండ్రి ఆశయ సాధనే ధ్యేయంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్ షర్మిల ఇప్పటికే నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ప్రతి మంగళవారం దీక్ష చేపడుతూ నిరుద్యోగుల పక్షాన నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు.

పార్టీ విస్తరణపై వైఎస్ అభిమానుల మీద ఆధారపడుతున్నారు. పాత నాయకుల ప్రమేయం లేకుండానే కొత్త వారితోనే తాను పార్టీని ముందుకు తీసుకెళ్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సహాయ సహకారాలు తీసుకుంటున్నారు. పాదయాత్ర రూపకల్పనపై ఇప్పటికే పలు కోణాల్లో ఆలోచించి ప్రణాళిక రెడీ చేసుకున్నారు. దీనికి పీకే మద్దతు కూడా తీసుకుంటున్నారు.
గతంలో కూడా తన అన్న జగన్ జైలులో ఉండగా ఆయనకు అనుకూలంగా 2012 అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్ర 2013 ఆగస్టు 4 వరకు 14 జిల్లాల్లో 3 వేల కిలోమీటర్లు నిర్వహించారు. తన అన్న పాదయాత్ర రికార్డును తిరగరాసేలా షర్మిల పాదయాత్ర రూపకల్పన చేశారు. దీంతో అదే అనుభవంతో ఇప్పుడు తన తండ్రి అడుగు జాడల్లో పాదయాత్ర చేపట్టి తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలని పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. తండ్రి మాదిరిగానే చేవెళ్ల నుంచి చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నారు.
Also Read: Balakrishna: హిందూపురంలో బాలయ్య చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదట
షర్మిల పాదయాత్ర 14 నెలలు, 4 వేల కిలోమీటర్లు, 90 నియోజకవర్గాల్లో కొనసాగేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి రోజు 12 కిలోమీటర్లు నడిచేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఇందులో భాగంగా రోడ్ మ్యాప్ లో చేపట్టబోయే మార్పులు చేర్పుల గురించి పీకే నేతృత్వంలో పలు కోణాల్లో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
Also Read: KCR: కేసీఆర్ మళ్లీ కదులుతున్నాడు..?