స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో ఓ డిగ్లామర్ పాత్ర కోసం అనసూయను అడిగారని సమాచారం. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించడం ఇష్టం లేకపోడంతో ఈ ఆఫర్‌కు సున్నితంగానే ఆమె నో చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి తనకు బ్రేక్ ఇచ్చిన సుకుమార్ కే అనసూయ హ్యాండ్ ఇవ్వడం నిజంగా విచిత్రమే. అయినా అనసూయ దృష్టిలో ఆలోచిస్తే మేకప్ లేకుండా నటిస్తే.. తనకున్న ఇమేజ్ మొత్తం పోతుంది. అందుకే ఆమె సుకుమార్ కి నో చెప్పి ఉండొచ్చు. ఇక మారేడుమిల్లి అడవుల్లో పుష్ప షూటింగ్ జరుగుతుండగా… ప్రొడక్షన్ టీంలో పనిచేసే ఓ వ్యక్తి కరోనాతో చనిపోయిన దురదృష్ట సంఘటన అందరకి తెలిసిన సంగతే.
Also Read: పెళ్లి కుమార్తెగా నిహారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు !
కాగా దాంతో టీం మొత్తం హడావిడిగా టెస్ట్ చేయించుకోగా.. ఇప్పటికే పుష్ప టీమ్ లో మొత్తం 20 మందికి కరోనా సోకిందని రిపోర్ట్స్ రావడంతో.. షూటింగ్ ని రద్దు చేసుకొని హైదరాబాద్ కి తిరిగి వచ్చేసింది పుష్ప టీమ్. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మొదట ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలి. విజయ్ కూడా ఆ పోలీస్ పాత్రలో నటిస్తా అని కమిట్ అయ్యాడు. అయితే కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
Also Read: ఇప్పటికీ ఎప్పటికీ మహానటి ఒక్కరే !
అయితే మొన్నటివరకూ ఈ పాత్రలో తమిళ్ హీరో ఆర్యను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. పైగా ఆర్య గతంలో బన్నీ వరుడు సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అందుకే ఆర్య కూడా బన్నీ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడు అన్నారు. అలాగే ఈ సినిమాలో ఓ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు పుష్ప సినిమా కూడా హిట్ అయితే ఇక రష్మిక కెరీర్ పీక్ కి వెళ్లడం ఖాయం. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్