ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై అందరికి ఆసక్తి నెలకొంది. గత ఏడాది ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? లోటు ఎంత? అనే దానిపైనే కథనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి సంబంధం లేదంటే కుదరదు. గత ఏడాది బడ్జెట్ ఆధారంగానే ఈ సంవత్సర బడ్జెట్ ఉంటుంది. దాని ఆధారంగా లెక్కలు వేస్తారు. బడ్జెట్ విషయంలో పలు విధాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. లోటు విపరీతంగా ఉండడంతో దాన్ని ఎలా పూడ్చాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
దేశంలోని అన్ని స్టేట్లు బడ్జెట్ ఆమోదించుకున్నాయి. ఒక్క ఏపీ మాత్రం మూడు నెలలకు ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ఆమోదించుకుంది. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. దీంతో ఎలాగని ఆలోచన చేస్తున్నారు లోటును ఏవిధంగా తగ్గించాలని ప్రణాళికలు వేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్ రూ.1.80 వేల కోట్లకు పైగా ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ.77 వేల కోట్లని అంచనాలు తయారు చేశారు. దీంతో బడ్జెట్ రూపకల్పనపై అందరికీ ఆసక్తి నెలకొంది.
రూ. లక్ష కోట్లకు పైగా లోటు
ఏపీ సర్కారు బడ్జెట్ లో రూ. లక్ష కోట్లకు పైగా లోటు ఏర్పడనుంది. కాగ్ ఇటీవల విడుదల చేసిన అంచనాల్లో ఈ మేరకు లోటు ఏర్పడనుందని తెలిసింది. దీంతో లోటును ఎలా కవర్ చేస్తారోనని ఉత్కంఠగా ఉన్నారు. మొత్తం బడ్జెట్ రూ.2.80 వేల కోట్లు అవసరం ఉంది. కానీ ప్రభుత్వానికి రూ.2.30 వేల కోట్లు అవసరం అవుతాయని చెబుతున్నారు. దీంతో ఏపీ సర్కారుకు చిక్కులు వచ్చే అవకాశం లేకపోలేదు.
అందరిలోనూ ఉత్కంఠ
బడ్జెట్ రూపకల్పనలో భారీగా అంచనాలు ఉండడంతో లోటు సైతం అందే స్థాయిలో కనిపించడంతో అందరిలోనూ ఉత్కంఠ రేగుతోంది. లోటును ఎలా సరి చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. సీఎం సంక్షేమపథకాల బాట పట్టడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని పలువురు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈనేపథ్యంలో బడ్జెట్ గంగాన్ని ఎలా గట్టెక్కుతారో వేచి చూడాల్సిందే.