European Military Aid To Ukraine: రంగంలోకి యూరోపియన్ దేశాలు.. రష్యాతో ఫైట్ కు ఉక్రెయిన్ కు మిలటరీ సాయం..

European Military Aid To Ukraine: రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఎనిమిది రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంతో రష్యా గెలిచినట్లా..? ఉక్రెయిన్ ఎదురొడ్డి పోరాడుతోందా..? అంటే చెప్పలేం. కానీ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్ ప్రభావం మిగతా దేశాలపై కచ్చితంగా పడుతుందని మాత్రం చెప్పొచ్చు. ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పొరుగు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎమర్జెన్సీ మీటింగ్స్ ను పెడుతున్నారు. […]

Written By: NARESH, Updated On : March 3, 2022 12:06 pm
Follow us on

European Military Aid To Ukraine: రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఎనిమిది రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంతో రష్యా గెలిచినట్లా..? ఉక్రెయిన్ ఎదురొడ్డి పోరాడుతోందా..? అంటే చెప్పలేం. కానీ ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న వార్ ప్రభావం మిగతా దేశాలపై కచ్చితంగా పడుతుందని మాత్రం చెప్పొచ్చు. ఈ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం పొరుగు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎమర్జెన్సీ మీటింగ్స్ ను పెడుతున్నారు. స్వీడన్, ఫిన్ లాండ్ దేశాలు ఏ దేశానికి మద్దతు ఇవ్వకపోయినా అత్యవసర సమావేశాన్ని పెట్టుకున్నాయి..మరో దేశం పోలండ్ లో తమ దేశ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Russia Ukraine

రష్యా చేస్తున్నచర్యలను నాటో దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు తమకు అండగా ఉంటామన్న యూరోపియన్ దేశాలు సరైన సమయానికి హ్యాండిచ్చాయని ఉక్రెయిన్ వాసులు మండిపడుతున్నారు. కానీ ఉక్రెయిన్ కు ఈయూ దేశాలు నేరుగా సాయం చేయకపోయినా రష్యాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దేశం రష్యాకు ధీటుగా పోరాడుతోందని తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కానందున మిలటరీ సాయం చేయమని ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ నాటో దేశాలపై మాత్రం ఈగ వాలినా రెచ్చిపోయేందుకు రెడీగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నారు.

Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ -రష్యా వార్.. అభాసుపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

అయితే రష్యా టార్గెట్ ఉక్రెయిన్ మాత్రమే అయినందున మిగతా దేశాల జోలికి పోవడం లేదు. బ్రిటన్, లేదా ఇత దేశాలపై యుద్ధం చేసే అవసరం రష్యాకు లేదని కొందరు అంటున్నారు. అయితే పరోక్షంగా మాత్రం యుద్ధం ఆపాలని రష్యాకు అమెరికా లాంటి దేశాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.తాజాగా పుతిన్ ను నియంతలా పోల్చాడు అమెరికా అధ్యక్షుడు బైడెన్. మరోవైపు రష్యాపై ఆర్థిక ఆంక్షలకు యూరప్ దేశాలు స్పీడు పెంచాయి. అయితే వాటాని ఉక్రెయిన్లు స్వాగతించినా అవేమీ సరిపోవని అంటున్నారు. కానీ ఆర్థిక ఆంక్షలతో రష్యాకు ఫైనాన్షియల్ గా తీవ్ర దెబ్బ పడుతుందని అంటున్నారు.

ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమిస్తే ఏం జరుగుతందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించుకుంటే ఆ దేశ ఆదీనంలోకి కీవ్, ఇతర నగరాలు వెళ్లిపోతాయి. దీంతో ఈనగరాల్లో ఉన్న యూరోపియన్లు తీవ్రంగా నష్టపోతారు. కీవ్ దాదాపు నాటోకు అనుకూలమైన నగరం. అందువల్ల కీవ్ ను ఎట్టి పరిస్థితుల్లో రష్యాకు చేజిక్కకుండా ఉక్రెయిన్లు జాగ్రత్తపడుతున్నారు. కానీ రష్యా మాత్రం బాంబుల వర్షం కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్లోని ఇప్పటికే ప్రధాన టీవీ టవర్ ను పేల్చేసింది. గవర్నర్ కార్యాలయంపై దాడి చేసింది. ఇక అధ్యక్షుడు తమ ఆధీనంలోకి వస్తే దేశం ఆక్రమణలోకి వెళ్లినట్లేనని అంటున్నారు.

Also Read: KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్.. టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటం

మరోవైపు పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ కు ఆయుధాల రవాణా కొనసాగుతోంది. ముఖ్యంగా కెనడా నుంచి వస్తున్న మిలటరీ పొలండ్ ద్వారా రవాణా అవుతున్నాయి. రష్యా సైనికులు లేని ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ విమానాలను గుర్తించి పేల్చేస్తుంది. దీంతో ఆ గుండా ప్రయాణించకుండా ఆయుధాలు ఉక్రెయిన్లోకి చొరబడుతున్నాయి. ఇక ఇప్పుడు రష్యా యుద్ధం ఎందుకు చేయాల్సి వచ్చిందని కొందరు చర్చించుకుంటున్నారు. కరోనా కారణంగా ఇంతకాలం కామ్ గా ఉన్న పుతిన్.. అప్ఘనిస్తాన్ విషయంలో అమెరికా ప్రవర్తించిన తీరుతో దూకుడుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న సమయంలో నాటో దళాలు ఏం చేయలేకపోయాయని, ఇప్పుడు కూడా తమ మీదికి రారని రష్యా ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video:

Tags