Etela Rajender: ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్‌కు నమ్మిన బంటు. తెలంగాణ ఉద్యమానికి ఆర్థిక అండ. టీఆర్ఎస్ ముఖ్య నాయకుడు. సీఎం కేసీఆర్ తరువాత ఆయనంత పవర్ ఫుల్ రెండో శ్రేణి నాయకుడు. ఇవన్నీ ఐదు నెలల క్రితం వరకు టీఆర్ఎస్ కార్యకర్తల్లో, కింది స్థాయి నాయకుల్లో, ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ ఒక్క సారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలు రావడం. దానిని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకోవడం, ఆరోగ్య శాఖను లాక్కోవడం, దీంతో ఆత్మాభిమానంతో ఈటల మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ఒక్క సారిగా జరిగిపోయాయి. వెను వెంటనే ఎన్నికలు రావడం, హోరా హోరీ పోరు జరగడం, ఎన్నికల్లో మళ్లీ ఈటల విజయం సాధించడం చకచకా జరిగిపోయాయి.

5 నెలల క్రితం వరకు మంత్రి.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే..
5 నెలల క్రితం వరకు ఈటల రాజేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మంత్రి. కేసీఆర్ ముఖ్య అనుచరుడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే. టీఆర్ఎస్, కేసీఆర్ వ్యతిరేకి. రాజకీయాల్లో ఎప్పుడు ఏవైనా జరగొచ్చు అని చెప్పడానికి ఇటీవల జరిగిన పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంత వరకు అధికార పార్టీలో ఉండి, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని విమర్శించిన నాయకుడే.. ఇప్పుడు అదే బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా నిలవడం అంటే ఒక విచిత్రమనే చెప్పవచ్చు.
Also Read: Huzurabad Bypoll Results: మినీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి షాక్.. ఏం సంకేతాలిస్తున్నాయి?
ఈటల పోరాటమంతా టీఆర్ఎస్, కేసీఆర్‌తోనే..
ఆత్మాభిమానంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్న ఈటల రాజేందర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారనే అంశం రాజకీయావర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ ప్రశ్నకు ఆయనే నిన్న జవాబు చెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా అధికారుల నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న తరువాత ఈటల మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో ఓట్ల అస్త్రంగా సీఎం కేసీఆర్ ప్రయోగించిన దళితబంధునే తాను ఆయుధంగా చేసుకోబుతున్నాని తెలిపారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సీఎం చెప్పినట్టు అన్ని కులాలకు అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాలని తెలిపారు. రాష్ట్రం అంతటా దళితులకు ఆ పథకం చేరే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా అక్కడ పోరాటం చేస్తానని, వారి గొంతుకను అవుతానని తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని, హుజూరాబాద్‌లో ఇచ్చినట్టే రాష్ట్రం అంతటా పింఛన్లు అందించాలని అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ కు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని, ఇది తనకు మరో పునర్జన్మ అని అన్నారు. తనకు ఓట్లేసి గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఒక్క హుజూరాబాద్ ప్రజల తీర్పే కాదని,ఇది రాష్ట్ర ప్రజలందరి తీర్పని చెప్పారు.