Etela Rajender Life History: కేసీఆర్ ఆప్తుడే ఇప్పుడు శత్రువైన వేళ.. ఈటల రాజేందర్ ప్రస్థానం ఇదీ..

Etela Rajender Life History: కేసీఆర్ కు ఒకప్పుడు కుడిభుజం ఈటల రాజేందర్. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పితే రాష్ట్రంలో ఈటల రాజేందర్ అసెంబ్లీలో వాణివినిపించారు. టీఆర్ఎస్ తొలి శాసనసభాపక్ష నేత ఈటల రాజేందర్ యే. అంతటి నేర్పరి ఇప్పుడు శత్రువయ్యాడు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యాడు. అనంతరం తను ఎదిగిన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తనను తొలగించి అవమానించిన కేసీఆర్ తో ఫైట్ చేశాడు. చివరకు కేసీఆర్ పంతం ఓడి.. […]

Written By: NARESH, Updated On : November 3, 2021 9:56 am
Follow us on

Etela Rajender Life History: కేసీఆర్ కు ఒకప్పుడు కుడిభుజం ఈటల రాజేందర్. కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పితే రాష్ట్రంలో ఈటల రాజేందర్ అసెంబ్లీలో వాణివినిపించారు. టీఆర్ఎస్ తొలి శాసనసభాపక్ష నేత ఈటల రాజేందర్ యే. అంతటి నేర్పరి ఇప్పుడు శత్రువయ్యాడు. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయ్యాడు. అనంతరం తను ఎదిగిన టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తనను తొలగించి అవమానించిన కేసీఆర్ తో ఫైట్ చేశాడు. చివరకు కేసీఆర్ పంతం ఓడి.. ఈటల రాజేందర్ పట్టుదలనే గెలిచింది. అసలు ఈటల రాజేందర్ ఎలా ఎదిగాడు? ఆయన ప్రస్థానం ఏంటి? కేసీఆర్ తో ఎందుకు గొడవ.. అనే దానిపై స్పెషల్ ఫోకస్..

etela rajendar kcr

తెలంగాణలో గత ఆరునెలలుగా కొనసాగిన రాజకీయ వేడి హుజూరాబాద్ ఎన్నికల ఫలితంతో తగ్గిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఫైట్ మొత్తానికి తెర పడినట్లయ్యింది. తనను మంత్రి పదవి నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారనే నెపంతో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో నవంబర్ 30న ఎన్నిక నిర్వహించారు. మంగళవారం ఆ ఓట్లను లెక్కించారు. ఈ ఎన్నికల్లో ఈటల రాజేంద్ 24వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటికే ఆరుసార్లు ఎన్నికైన రాజేందర్ తాజా గెలుపుతో ఆయన ఖాతాలో ఏడో విజయం వరించినట్లయింది. అయితే ఇందులో మూడు సాధారణ, నాలుగు ఉప ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతటి ప్రజాధరణ పొందిన రాజేందర్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు..? అంతకుముందు ఏం చేశారు..? అనేది ఆసక్తిగా మారింది.

ఒకప్పుడు కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉన్న కమలాపూర్ రాజేందర్   స్వస్థలం. ఆయన 1984లో డిగ్రీ పూర్తి చేశారు. మొదటి నుంచి వామపక్ష భావాజాలం ఉన్న ఆయన పీడీఎస్లో చేరారు. ఈ సమయంలో జమునరెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. రాజేందర్ ముదిరాజ్ కులానికి చెందిన వారు కాగా.. జమున ‘రెడ్డి’ కులస్థురాలు. ఆ తరువాత వీరిద్దరు కలిసి పీడీఎస్ లో పనిచేశారు. వీరికి కొడుకు నితిన్ రెడ్డి, కుమార్తె నీతారెడ్డి.

ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజేందర్ తెలంగాణ ప్రత్యేక పోరాటం వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ ప్రారంభం నుంచి ఆయన ఒకే పార్టీలో ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన కమలాపూర్ నియోజకవర్గం నుంచి 2004,2009లో గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఏర్పడ్డ హుజూరాబాద్ నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు గెలుస్తూ వస్తున్నారు. 2002లో టీఆర్ఎస్ కు జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు.

ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఆయనపై 19 క్రిమినల్ కేసులున్నాయి. ఐదు కేసుల్లో ఆయన ధోషిగా తేలారు. అవి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవే. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈటల రాజేందర్ పై ‘2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ 50 స్థానాల్లో పోటీ చేస్తే 40 చోట్ల ఓటమి చెందింది.. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేందర్’ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజేందర్ కీలక నాయకుడిగా వ్యవహరించారు. పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీలో రెండో స్థానం నాయకుడిగా మారిపోయాడు. ఒకానొక సందర్భంగా కేసీఆర్ ‘ఈటల రాజేందర్ నా కుడిభుజం ’ అని వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో ఈటల రాజేందర్ కీలకంగా వ్యవహరించారు. ఈటలపై ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్ ‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించారు.

2018 ఎన్నికల తరువాత కేసీఆర్, ఈటల రాజేందర్ మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. కొన్ని సందర్భాల్లో ఈటల రాజేందర్ ‘పార్టీకి ఓనర్లం మేము కూడా’ అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను ఎదురించారు. దీంతో ముసలం మొదలైంది. కేసీఆర్ ఎలాగైనా ఈటలను బయటకు పంపాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఈటలపై అవినీతి ఆరోపణల వార్తలు గుప్పుమన్నాయి.  ఈటల రాజేందర్ స్థాపించిన జమునా హాచరీస్ పై భూ అక్రమణ ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసీఆర్ ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆ తరువాత ఆయన జూన్ 4న పార్టీకి, 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జూన్ 14న ఢిల్లీలో బీజేపీలో చేరారు. ఇప్పుడు హోరా హోరీగా సాగిన ఎన్నికలో చివరికి ఈటల రాజేందర్ 24వేల ఓట్లతో గెలుపొందారు. కేబినెట్ నుంచి తొలగించిన కేసీఆర్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు. పాత మిత్రుడికి ఇప్పుడు కొత్త శత్రువుగా మారారు. ఈటలను అసెంబ్లీలో అడుగుపెట్టనియ్యవద్దని హుజూరాబాద్ లో కోట్లు కుమ్మరించిన కేసీఆర్ పంతం నెరవేరలేదు. కేసీఆర్ ఆప్తుడే ఇప్పుడు శత్రువై నిలబడ్డాడు.