Homeజాతీయ వార్తలుBJP vs KCR: కేసీఆర్ పై ప్రతీకారానికి ‘ఈటల’నే బీజేపీ అస్త్రం

BJP vs KCR: కేసీఆర్ పై ప్రతీకారానికి ‘ఈటల’నే బీజేపీ అస్త్రం

BJP vs KCR: రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. అధికారమే పరమావధిగా పని చేస్తాయి. ఇందుకు బీజేపీ మినహాయింపు కాదు. మొన్న పరేడ్ గ్రౌండ్ లో, అంతకు ముందు నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతమైన తీరుతో అధిష్టానం రెట్టించిన ఉత్సాహంతో ఉంది. “గో హెడ్” అంటూ బండి సంజయ్ కి మరిన్ని పగ్గాలు ఇచ్చింది. దీంతో బండి సంజయ్ చేరికలకు, ఫైనాన్స్ కు, ప్రజా సమస్యల పై మూడు కమిటీలను నియమించారు. అందులో అత్యంత కీలకమైనది చేరికల కమిటీ.

BJP vs KCR
Etela Rajender, KCR

ఇంద్రసేనారెడ్డిని తప్పించి రాజేందర్ కు బాధ్యతలు

బీజేపీ అర్బన్ ప్రాంతాల్లో బలంగా ఉంది. కానీ అధికారంలోకి రావడానికి ఇది ఒక్కటే సరిపోదు. రూరల్ లోనూ సత్తా చాటితేనే బీజేపీ అధికారం దక్కించుకుంటుంది. ఇందుకు బలమైన కేడర్ కావాలి. ఇప్పుడు ఆ కేడర్ ను భర్తీ చేసే బాధ్యత ఈటల రాజేందర్ కు అధిష్టానం అప్పగించింది. ఇటీవల ఈటల రాజేందర్ పై మరలా సర్కారు కక్ష కట్టింది. మసాయిపేట భూముల్ని అసైన్డ్ పేరుతో రైతులకు అప్పగించింది. దీంతో కసి మీద రగులుతున్న ఈటెల రాజేందర్ ఎలాగైనా టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. చేరికల కమిటీ బాధ్యత ఆయనకు అప్పగించడంతో స్వామి కార్యం, స్వ కార్యం నెరవేరుతుందని ఆయన భావిస్తున్నారు.

Also Read: PM Modi- YS Jagan: ఏపీలో బీజేపీ మార్కు రాజకీయం… వారిద్దరికంటే జగనే మేలంటున్న మోదీ, షా ద్వయం

టీఆర్ఎస్ మీదే ఎక్కువ ఫోకస్

అన్ని పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానించాలని అధిష్టానం ఆదేశించినా బీజేపీ మాత్రం టీఆర్ఎస్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మినహా అందరూ జనాల్లో అంతగా యాక్టిివ్ గా లేకపోవటంతో బీజేపీ కేవలం టీఆర్ఎస్ మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీలోకి చేరిన నేపథ్యంలో అదే ఒరవడి కొనసాగించాలని భావిస్తోంది.

ఆ స్థాయిలో ఉంటాయా?

ఇతర పార్టీల నాయకులు భారీగా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. పైగా ఇటీవల బీజేపీ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన నలుగురు కార్పొరేటర్లు, వరంగల్ కి చెందిన ఓ కార్పొరేటర్ బీజేపీ లోకి వెళ్లారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ కార్పొరేటర్లతో బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయం లో ప్రమాణం కూడా చేయించారు. ప్రధాని మోదీ ఢిల్లీ పిలిపించుకున్నాడు. అయినప్పటికీ వారు ఆగలేదు.

BJP vs KCR
Etela Rajender, KCR

ఏం ఆశ చూపుతారు?

రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి వెళ్తారు. ఇందుకు కొందరు మినహాయింపు. ఆ కొందరే ఏ పార్టీ కైనా కీలకం. ఇప్పుడు ఆ కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ తహతహలాడుతున్నది. అధికార పార్టీ అయితే కాంట్రాక్టులు ఇస్తామనో, తాయిలాలు ఇచ్చో పార్టీలోకి చేర్చుకుంటుంది. మరి ప్రతిపక్ష పార్టీ? అందునా మూడు ఎమ్మెల్యేలు, నాలుగు ఎంపీలు మాత్రమే ఉన్న పార్టీ ఏం చేయాలి? టిక్కెట్లు ఇస్తామని ఎవరికీ హామీ ఇవ్వొద్దని బండి సంజయ్ మొన్న ఆ మధ్య ఈటల రాజేందర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయనే చేరికల కమిటీ బాధ్యుడుగా ఉన్నారు. మరి ఏ ఆశలు చూపి పార్టీలోకి ఆహ్వానిస్తారు? అధికార పార్టీ నాయకుల పై డేగ కన్ను ఉండటంతో అది సాధ్యమేనా అని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇక బీజేపీ హంగూ ఆర్భాటం ప్రదర్శిస్తూ ఉంటే కాంగ్రెస్ మాత్రం సైలెంట్ గా పని చేసుకొని పోతోంది. నల్లాల ఓదెలు నుంచి బడంగ్పేట్ మేయర్ దాకా తమ పార్టీలో చేర్చుకుని సత్తా చాటింది. రేవంత్ దూకుడుతో ఒకప్పటి కాంగ్రెస్ ఇదేనా అనిపిస్తోంది. ఇక ఈటల కూడా దూకుడు స్వభావం ఉన్న నాయకుడు,పైగా ఉద్యమ నేపథ్యం ఉండటంతో ఆయన సారథ్యంలో చేరికలు భారీగానే ఉంటాయని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. మరో వైపు మా ఎమ్మెల్యేలు కాదు ముందు మీ ఎంపీలను కాపాడుకోండని బీజేపీ నాయకులకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసురుతుండటం గమనార్హం.

Also Read:Bandi Sanjay: విజయ్ సంకల్ప పరీక్షలో బండి సంజయ్ కి డిస్టింక్షన్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version